వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ కశ్మీర్: అజిత్ దోవల్ కు సీరియస్ టాస్క్..! ఆగస్ట్ 15 వరకు అక్కడే..!! ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం .. జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. దీనిని పాకిస్థాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వ్యతిరేకించడంతో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. దాదాపు 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవల ఆయన శ్రీనగర్‌ రహదారులపై రహదారుల మీద భోజనం చేసి పరిస్థితి బాగుందనే సంకేతాలను ఇచ్చారు. ఇవాళ అనంతనాగ్‌లో పర్యటించి .. స్థానికులమే మమేకమయ్యారు. అయితే వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆయన ఢిల్లీ చేరుకోవాలి .. కానీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా అనే కోణంలో .. ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యేవరకు అక్కడే ఉంటారని కేంద్రప్రభుత్వం తెలిపింది.

On mission Kashmir, why NSA Doval could stay back in Kashmir till Aug 15

ఇన్నాళ్లు కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేది. కానీ నేడు మువ్వన్నెల జెండా ఎగరవేయనుండటంతో .. ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఆయన స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు 12న బక్రీద్ పర్వదినం కూడా ఉన్నందున .. ప్రేరేపిత ఉగ్రవాదుల కదలికలను నిశీతంగా గమనిస్తున్నారు. ఇప్పటికే సముద్రమార్గాన ఉగ్రవాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో .. మరింత అప్రమత్తమయ్యారు. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం .. మరుసటి రోజు భారత్ ఇండిపెండెన్స్ డే .. ఇన్ని కీలకమైన రోజులు కాబట్టి ... దోవల్ కశ్మీర్‌లోనే మకాం వేశారు. అంతేకాదు ఎప్పటికప్పుడు సిబ్బందిన అలర్ట్ చేస్తూ .. వీధుల్లో తిరుగుతున్నారు. ఆయన సందర్శనకు సంబంధించి మీడియాకు ఫోటోలు ఇస్తూ మంచి సంకేతాలను ఇస్తున్నారు.

English summary
National Security Adviser Ajit Doval, who landed in Srinagar on Monday and has been camping in the Kashmir Valley since then, is expected to stay put till Independence Day celebrations are held on August 15, people familiar with the development said. Till then, Doval also has to ensure that Bakrid passes off peacefully with Kashmiris celebrating the festival and Pakistan’s effort to engineer violence on August 14, their independence day, is neutralised to a large extent. Pakistan’s top security panel has already announced that it would observe its Independence Day in solidarity with what it described as the struggle of the Kashmiri people and August 15, as a black day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X