వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదంపై కేసు: 'రైలు బోగీ మా ఇంట్లోకి దూసుకొచ్చింది'

యూపీలో రైలు ప్రమాదంపై ఐపీసీ 304 ఏ(నిర్లక్ష్యం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి గల కారణాలపై ఆదివారం సాయంత్రంలోగా తెలియజేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ర

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో రైలు ప్రమాదంపై ఐపీసీ 304 ఏ(నిర్లక్ష్యం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి గల కారణాలపై ఆదివారం సాయంత్రంలోగా తెలియజేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రైల్వేబోర్డు ఛైర్మన్‌ను ఆదేశించారు.

కారణమిదే: ఉత్కల్ ట్రైన్ ప్రమాదానికి అనధికార ట్రాక్ నిర్వహణకారణమిదే: ఉత్కల్ ట్రైన్ ప్రమాదానికి అనధికార ట్రాక్ నిర్వహణ

ఈ శనివారం ఖతౌలీ వద్ద పూరీ-హరిద్వార్‌ కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురి కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 156 మంది గాయపడినట్లు యూపీ అధికారులు చెబుతున్నారు.

On UP Train Tragedy, Railways Minister Suresh Prabhu Says 'Fix Responsibility' By Today

ప్రమాదం కారణంగా ట్రాక్‌ దెబ్బతినడంతో మీరట్‌ రైల్వేలైనుపై వెళ్లే పలు రైళ్ల సర్వీసులను దారి మళ్లించారు. సాయంత్రం ఆరు గంటల్లోగా ట్రాక్‌ పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి స్థానికులు సహాయం చేశారు.

శనివారం ఇంటి బయట కూర్చున్నానని, ఇంతలో ఓ భారీ శబ్దం వినిపించిందని, ఆ శబ్దం ఏమిటా అని అటు చూడగా.. ఓ రైలు బోగీ ఇంకో బోగీని తోసుకుంటూ తమ ఇంటి వైపు దూసుకొచ్చిందని, ఇంటి గోడలోకి చొచ్చుకుపోయిందని, వెంటనే భయంతో వణికిపోయి అక్కడి నుంచి పరుగు పెట్టానని మనోజ్‌ అనే ప్రత్యక్ష సాక్షి యూపీ ఘోర రైలు ప్రమాదం గురించి వివరించాడు.

On UP Train Tragedy, Railways Minister Suresh Prabhu Says 'Fix Responsibility' By Today

రైలు పట్టాలు తప్పిన అనంతరం ఓ బోగి స్థానికంగా ఓ దుకాణం నిర్వహించుకునే మనోజ్‌ ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదం గురించి అతను మాట్లాడాడు.

ప్రమాదం జరిగిన అనంతరం తమ ఇంటి ముందు మృతదేహాలు, తెగిపడిన రైల్వే ట్రాక్‌ కనిపించాయని చెప్పాడు. తమ ఇంటిని దాటుకొని ఓ బోగి సమీపంలోని కళాశాల గోడను ఢీకొందన్నాడు. ఆ భయానక పరిస్థితి నుంచి తమ కుటుంబం ఇంకా తేరుకోలేదన్నాడు.

English summary
The Puri Haridwar Utkal Express derailed in Khatauli in Uttar Pradesh's Muzaffarnagar district on Saturday, killing 23 and injuring over 70 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X