వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభినందన్‌కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. అభినందన్ ఫిట్‌గా ఉంటే ఫైటర్ జెట్ విమానాలలో తిరిగి విధులు అప్పగిస్తామని చెప్పారు.

'అభినందన్ తిరిగి జెట్ ఫైటర్లను నడపగలడా లేడా అనేది అతని మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. అతని మెడికల్ చెకప్‌లు చేస్తున్నాం. అతనికి అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తాం. అతని మెడికల్ ఫిట్‌నెస్ ఉంటే తిరిగి ఫైటర్ కాక్‌పిట్‌లోకి వస్తాడు' అని బీఎస్ ధనోవా తెలిపారు.

ఎంతమంది టెర్రరిస్ట్‌లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్ మార్షల్ఎంతమంది టెర్రరిస్ట్‌లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్ మార్షల్

Once we get Abhinandan medical fitness, he will get into fighter cockpit: Air Chief Marshal

తాము పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్‌లో మృతుల వివరాలు, సంఖ్య వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. మిగ్ 21 బైసన్ విమానాలకు పూర్తిస్థాయి సామర్థ్యం ఉందన్నారు. వైమానిక దాడులు జరగకుంటే పాక్ ఎందుకు స్పందిస్తుందన్నారు.

కాగా, అభినందన్ వర్ధమాన్‌కు ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతని శరీరంలో ఏదైనా చిప్‌ను పాక్‌ ఆర్మీ చొప్పించిందా? అనే కోణంలో జరిపిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఎలాంటి స్పై బగ్ లేనట్లు నిర్ధారించారు. అయితే అతను పారాచ్యడ్‌ ద్వారా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగడంతో అక్కడి ప్రజలు జరిపిన దాడిలో పక్కటెముకకు గాయమైనట్లు గుర్తించారు. దీంతోపాటు వెన్నెపూస కింది భాగంలో గాయాలున్నాయని, ఆయన పారాచ్యూట్‌ ద్వారా దిగే సమయంలో ఆ గాయం అయ్యి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.

యుద్ధఖైదీగా చిక్కాక అక్కడి సైన్యం ఏయే ప్రశ్నలు వేసింది? అభినందన్‌ వారికి ఏం చెప్పాడు అనే కోణంలో రక్షణ ఏజెన్సీల విచారణ కొనసాగనుంది. మరోవైపు అభినందన్‌కు త్వరలో బెంగళూరులోని ఐఏఎంలో పరీక్షలు నిర్వహించనున్నారు. కార్గిల్‌ యుద్ధం సమయంలో పాక్‌లో దిగిన ఫైటర్‌ పైలట్‌ నచికేతకు పరీక్షలు నిర్వహించారు. నెగటివ్‌ రిపోర్టు రావడంతో ఆయన్ను అప్పట్లో ఫైటర్‌ జెట్‌ విధుల నుంచి తప్పించారు.

English summary
Air Chief Marshal BS Dhanoa said 'Whether Wing Commander Abhinandan flies or not depends on his medical fitness. That's why post ejection, he has undergone medical check. Whatever treatment required, will be given. Once we get his medical fitness, he will get into fighter cockpit'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X