కాల్పులకు తెగబడ్డ పాక్: జవాను మృతి, 7గురికి గాయాలు
రాజోరి ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్ భద్రతా దళాలు హెవీ మోర్టార్లతో భారీగా కాల్పులు జరిపాయి. ఒక భారత జవాను మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మరణించగా, ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. బీఎస్ఎఫ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజ్ సింగ్.. పాక్ కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. రాజోరి ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాలు హెవీ మోర్టార్లతో భారీగా కాల్పులు జరిపాయి.
In pic: BSF head constable Rai Singh who lost his life in heavy shelling by Pakistan in Rajouri district of Jammu and Kashmir. pic.twitter.com/krnwIOEGy4
— ANI (@ANI_news) 21 November 2016
కాగా, గత 24 గంటల్లో సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మూడు సార్లు ఉల్లంఘించింది. పాక్ కాల్పులకు ధీటుగా భారత జవాన్లు కూడా స్పందిస్తున్నట్ల ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సెప్టెంబర్‌లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పటికి వరకూ నియంత్ర రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 286 సార్లు ఉల్లంఘించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించగా, వీరిలో 14 మంది జవాన్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications