వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెదిరింపుల కేసు, మెయిల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరించిన కేసు సైబర్ సెల్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే మెయిల్స్ చేస్తుంటాడని ప్రాథమికంగా తేల్చారు. అతనిని మానసిక వైద్యుడికి చూపిస్తున్నామని, వారు అందజేసే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మానసిక పరిస్థితి బాగోలేదు. తన ల్యాప్‌ట్యాప్ ద్వారా కొందరికి బెదిరింపు మెయిల్ చేస్తున్నాడు. అలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మెయిల్ వచ్చింది. తర్వాత దూషిస్తూ రావడంతో కేజ్రీవాల్ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్ పంపింది ఎవరూ అని ఆరాతీస్తే రాజస్థాన్‌లోని అజ్మీర్ చూపించింది. దీంతో ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ నిపుణులు మెయిల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి విస్తుపోయారు. మెంటల్ కండీషన్ బాగోలేని ఇతనెలా బెదిరింపు మెయిల్ చేశాడని వారే ఆశ్చర్యపోయారు.

One arrested for sending threat mails to Delhi CM

అతనికి వైద్యుల చేత కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఒక్కరే కాదు మరికొందరికీ కూడా అతను బెదిరింపు మెయిల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతని ల్యాప్‌ట్యాప్ సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. అతనికి మెయిల్ ఐడీ ఎక్కడి నుంచి వచ్చింది, అతనే బెదిరిస్తూ మెయిల్ చేశాడా ? లేదంటే ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సైబర్ సెల్ పోలీసులు తెలిపారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా తమ విచారణ కొనసాగుతుందని వారు తెలిపారు.

English summary
Delhi Police on Saturday arrested a man allegedly responsible for sending threatening and derogatory emails to Chief Minister Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X