వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గగన్‌యాన్ మిషన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్: అక్కడికి ఒక్కరు మాత్రమే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gaganyaan Mission Intresting Updates ! || Oneindia Telugu

అంతరిక్షంలోకి తొలిసారిగా మానవుడిని పంపే విషయమై రూపొందిస్తున్న గగన్‌యాన్ మిషన్ ప్రయోగంపై ఇస్రో చీఫ్ వివరాలను వెల్లడించారు. అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు వ్యక్తులను ఎంపిక చేసినట్లు చెప్పిన ఇస్రో వారికి 11 నెలల పాటు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తామని ఇది రష్యాలో జరుగుతుందని చెప్పారు. ఇక డిసెంబర్ 2021 నాటికల్లా గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. అయితే తొలిసారిగా ఒక్క వ్యక్తిని మాత్రమే నింగిలోకి పంపుతామని ఇస్రో చీఫ్ చెప్పారు.

గగన్‌యాన్ మిషన్ ఖర్చు

గగన్‌యాన్ మిషన్ ఖర్చు

గగన్‌యాన్ మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు కానుండగా ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపనుంది. వీరంతా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారు. వీరిని భూమికి 2000 కిలోమీటర్ల ఎత్తుకు పంపుతారు. ఇక్కడే మానవుడు తయారు చేసిన చాలా ఉపగ్రహాలు ఉంటాయి. 2022లో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరపుకునే నాటికి మన దేశానికి చెందిన వ్యక్తి ఒకరు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ భారత జెండాను ఎగురవేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ 2018 జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై నుంచి చెప్పారు.

రష్యాలో వ్యోమగాములకు శిక్షణ

రష్యాలో వ్యోమగాములకు శిక్షణ

ఇదిలా ఉంటే అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపిక చేసిన వ్యక్తులంతా పురుషులే అని శివన్ నిర్థారించారు. అయితే వారు ఎవరు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అన్నారు. జనవరి మూడోవారం నుంచి వారు రష్యాలో శిక్షణ పొందుతారని వెల్లడించారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు రష్యాలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. అక్కడి వాతావరణంకు అలవాటు పడేలాట్రైనింగ్ ఇస్తారు. 11 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత భారత్‌లో వారికి మాడ్యూల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఇస్రో రూపొందించిన మాడ్యూల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తారు.

ఆహారం తయారు చేస్తున్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్

ఆహారం తయారు చేస్తున్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్


ఇక మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీ గగన్‌యాన్‌లో ప్రయాణించేవారికి ఆహారం తయారు చేస్తోందని చెప్పారు శివన్. అంతేకాదు డీఆర్‌డీఓ ల్యాబ్స్ కూడా మిషన్ విజయవంతం అయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నాయని చెప్పారు. ఇక వ్యోమగాములకు స్పేస్‌ సూట్‌లను కూడా తయారు చేస్తున్నట్లు శివన్ చెప్పారు. ఇందుకోసం రష్యా సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు శివన్. ఇక వ్యోమగాములకు ఫుడ్ మెనూలో భాగంగా ఎగ్‌ రోల్స్, వెజిటేరియన్ రోల్స్, ఇడ్లీలు, మూంగ్ దాల్, హల్వా, పులావ్‌లు తయారు చేస్తున్నట్లు శివన్ చెప్పారు. ఇవి వేడి చేసుకునేందుకు ఒక ఫుడ్ హీటర్‌ను కూడా తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

 ఎంతమంది పంపుతామో తర్వాత చెబుతాం

ఎంతమంది పంపుతామో తర్వాత చెబుతాం

ఒక వారం రోజుల పాటు అంతరిక్షంలో ఉండేలా ముగ్గురు కోసం మిషన్‌ను తయారు చేస్తున్నామని డాక్టర్ శివన్ చెప్పారు. అయితే ఇద్దరిని పంపుతామా లేక ఒకరిని పంపుతామా అది తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు కూడా తొలిసారి అంతరిక్షంలోకి ఒక్క వ్యక్తినే పంపాయని అది కూడా చాలా తక్కువ రోజుల వరకే అక్కడ ఉంచాయని శివన్ గుర్తు చేశారు. ఇప్పటికే అన్ని హంగులతో కూడిన గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్ డిజైన్ పూర్తయ్యిందని శివన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పేపర్ వర్క్ పూర్తయ్యిందని చెప్పిన శివన్... మానవుడు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్ కాబట్టి అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. అంతేకాదు ఫెయిల్యూర్‌ రేట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని శివన్ చెప్పారు.

మిషన్‌లో హ్యూమన్ రోబో

మిషన్‌లో హ్యూమన్ రోబో

ఇదిలా ఉంటే నింగిలోకి వ్యోమగాములను జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 తీసుకెళ్లనుంది. దీనికి బాహుబలిగా అభివర్ణిస్తున్నారు. దీనికి నాలుగు దశల పేలోడ్ ఉండేలా తయారు చేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌నుంచి ఈ లాంచ్ వెహికల్ టేకాఫ్ తీసుకుంటుందని శివన్ తెలిపారు. మానవుడు ప్రయాణించాల్సి ఉన్నందున లాంచ్‌ప్యాడ్‌ను కూడా రీ మోడల్ చేస్తున్నారు. ఒక్కసారి ఇంధనం నింపితే లాంచ్‌ప్యాడ్‌కు ఆరు కిలోమీటర్ల వరకు ఎవరిని పంపమని శివన్ స్పష్టం చేశారు. ఇక మిషన్‌ను రివ్యూ చేసేందుకు ఇతర దేశాల నుంచి నిపుణులు వస్తారని చెప్పారు. ఇక ఈ మిషన్‌లో ఒక రోబోను కూడా పంపనున్నట్లు చెప్పారు శివన్. హ్యూమన్ రోబో వ్యోమగామి యొక్క బ్లడ్ ప్రెజర్ (బీపీ), హార్ట్ రేట్‌, ఆరోగ్యానికి చెందిన ఇతర పారామీటర్లను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుందని చెప్పారు శివన్.

English summary
Indian Space Research Organisation (Isro) chief K Sivan detailed the country’s first manned mission to space on Tuesday, saying the four men shortlisted for the programme will receive physical fitness training in Russia for 11 months, but the first spaceflight in December 2021 may carry just one person
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X