తండ్రి, కూతురు ఓ మంచి పని: పేదల ఆకలి తీర్చేందుకు కారులో ఆహారం తరలింపు.. 4 వేల మందికి అన్నం...
అసలే కరోనా వైరస్‌తో పేదలు ఆకలితో అలమటిస్తోన్నారు. ఈ సమయంలో మనస్సున మారాజులు ముందుకొచ్చి.. కడుపునింపుతున్నారు. ఎప్పుడూ బిజీగా ఉంటే పంకజ్ కుమార్.. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అయితే పేదల ఇబ్బందులను తెలుసుకున్నాడు. తన కూతురు హియాతో కలిసి పేదల ఆకలి తీర్చాలని ముందుడుగు వేశాడు.

కదిలించిన ఘటన..
కుమార్ మనస్సును కదిలించేందుకు ఒక సంఘటన కూడా జరిగింది. లాన్ డౌన్ వల్ల ఓ వ్యక్తి భార్య గర్భవతి.. కానీ తినడానికి తిండిలేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు దీంతో నార్త్ గోవాలో గల అస్సాగోలో తన ఇంటి నుంచి సౌత్ గోవాలోని వాస్కో, ఉత్తరగోవాలోని బిచోలిమ్ముకు వెళ్లి.. పేదలకు కావాల్సిన ఆహార పదార్థాలు అందజేశారు. బియ్యం, గోధుమలు, నూనె, తదితర నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో రెండువారాలు కుమార్ సరుకులు పంపిణీ చేయడంలో బిజీగా ఉన్నారు.

ఆశ్చర్యపోయిన డీసీ
తర్వాత ఆలయాలు, వసతగృహల వద్ద ఉన్న వలసకూలీల కోసం కుమార్ ఆహారం ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రభుత్వం వసతి కల్పించినా.. ఆహారం అందజేయకపోవడం.. కుమార్ చేయూతనివ్వడంతో వారి ఆకలి తీరింది. ఇందుకోసం రోజు తన కారులో గంటన్నర పాటు పయనించేవాడనిని.. పేదలకు ఆహారం అందజేసేందుకు వెళ్తున్నానని తెలిసి.. డిప్యూటీ కలెక్టర్ ఆశ్చర్యపోయారని కుమార్ తెలిపారు.

500 మందికి అన్నం
అలా పేదలకు భోజనం అందజేసే సంఖ్య క్రమంగా పెరిగిందని కుమార్ గుర్తుచేశాడు. వాస్కోడ గామా, బిచొలిన్ కూలీల సంఖ్య 400 నుంచి 500 వరకు చేరిందని తెలిపాడు. కానీ ఇప్పుడు వసతి గృహాలతోపాటు భోజన సదుపాయాలను ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశాడు. ఇప్పటివరకు రూ.2 లక్షలు ఖర్చుచేశానని... కెట్టో వెబ్ సైట్ ద్వారా సాయం కోరానని కుమార్ తెలిపారు. తనలాగే సాయం చేసేవారు చాలా మంది ఉన్నారని కుమార్ తెలిపారు.