వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ v/s విజయ్ ఫ్యాన్, విరాళాలపై గొడవ, డిష్యూం.. డిష్యూం, ప్రాణం తీసిన అభిమానం

|
Google Oneindia TeluguNews

తమిళ చిత్రసీమలో తారలకు అభిమానులు ఎక్కువే.. అభిమానం కూడా అధికమే. అయితే కరోనా వైరస్ సందర్భంగా ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఎవరూ ఎక్కువ విరాళం ఇచ్చారనే విషయంపై జరిగిన గొడవ ఒక అభిమాని ప్రాణం తీసింది. తమిళనాడు మరక్కానంలో జరిగిన ఘటన విషాదం నింపింది.

 ఫ్యాన్స్ మధ్య గొడవ

ఫ్యాన్స్ మధ్య గొడవ

మరక్కానం జిల్లా విల్లుపురానికి చెందిన యువరాజ్, దినేశ్ బాబు చిన్ననాటి స్నేహితులు. యువరాజ్.. విజయ్ ఫ్యాన్ కాగా.. దినేశ్ బాబు.. రజనీకాంత్‌కు వీరాభిమాని. కరోనా వైరస్ సందర్భంగా విరాళం అందజేసిన మొత్తంపై ఇద్దరి మధ్య ఈ నెల 23వ తేదీన గొడవ జరిగింది. మాటా మాట పెరిగింది. ఇద్దరు ఒకరికొకరు దూషించుకున్నారు.

మద్యం తాగలేదు...?

మద్యం తాగలేదు...?

మాటలు పెరగడంతో చేతులు లేచాయి. యువరాజ్.. దినేశ్ బాబును కిందపడేశాడు. అయితే దినేశ్ రాయి తీసుకొని.. యువరాజ్ తలపై బాదాడు. తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం ఎక్కువే అయ్యింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. యువరాజ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. దినేశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవ జరిగిన సమయంలో వారు మద్యం సేవించారా అని ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదు అని పోలీసులు సమాధానం ఇచ్చారు.

Recommended Video

Coronavirus Lockdown : Home Ministry Allows Reopening Of All Shops, Coditions Apply!
ఎక్కువ ఎవరు ఇచ్చారనే..

ఎక్కువ ఎవరు ఇచ్చారనే..

దలపతి అని పిలుచుకునే స్టార్ విజయ్ దేశం, రాష్ట్రం కోసం 1.3 కోట్ల విరాళం ప్రకటించారు. రజనీకాంత్ వివిధ యూనియన్లకు నగదును అందజేశారు. సినీ కార్మికులకు రేషన్ కూడా అందజేశారు. అయితే ఎవరు ఎక్కువ అందజేశారనే అంశంపై గొడవ జరిగి.. ఒకరి ప్రాణం తీసింది. క్షణికావేశంలో జరిగిన ఘటన నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

English summary
heated argument between two young men, over whose favourite movie star donated a higher amount to COVID-19 relief funds, has resulted in one of them dying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X