వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ పోస్ట్.. అతడి జీవితాన్ని మార్చబోతోంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ : పేస్ బుక్ లో మనకు నచ్చిన అంశాలను పోస్ట్ చేస్తుంటాం. లేదా మన వ్యాపార అవసరాలను వృద్ది చేసుకొనేందుకు ఉపయోగిస్తాం. దీనికి తోడు పాత స్నేహితులను, ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నవారిని కలిపే వేదికగా పేస్ బుక్ పనిచేస్తోంది. అయితే పేస్ బుక్ లో చేసిన ఒక పోస్టు ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించబోతోంది.

అరుదైన వ్యాధితో భాడపడుతున్న ఓ వ్యక్తి తన సమస్యను చెప్పుకొనేందుకు ఫేస్ బుక్ మాద్యమాన్ని ఉపయోగించుకొన్నాడు.తన సమస్యను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తనకు సహాయం చేయాలని అడిగారు.అయితే ఈ పోస్టుకు స్పందించిన వైద్యులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

one facebook post turn a life

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ళ అరుణ్ కుమార్ అనే యువకుడు నాలుగు ఉన్నాయి. సాధారణంగా అందరికీ ఉన్నట్టుగానే రెండు కాళ్ళు ఉన్నాయి.దీనికి అదనంగా నడుము భాగంలో కూడ మరో రెండు కాళ్ళు ఉన్నాయి.ఈ కారణంగా ఇబ్బందిపడుతున్నాడు. కనీసం కూర్చొనే పరిస్థితి కూడ ఆయనకు లేకుండా పోయింది.

ఈ సమస్య నుండి తనకు విముక్తి కల్పించాలని ఆయన అనేక మంది వైద్యులను సంప్రదించినా పలితం లేకపోయింది. తన సమస్యను తెలిపేలా ఒ పోటొను తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు అరుణ్ కుమార్. ఈ పోస్టుకు డిల్లీలోని ఫోర్టిన్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. నడుముబాగంలో అరుణ్ కుమార్ కు రెండు కాళ్ళు ఎలా వచ్చాయనే విషయమై డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు.అదనంగా ఉన్న రెండు కాళ్ళపై మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.అయితే ఆపరేషన్ జరిగితే అందరి మాదిరిగా తాను కూడ నడవగలుగుతానని అరుణ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
one facebook post turn a life. arunkumar from uttarpradesh state. He has 4 legs. he consult so many doctors.but no changes.he upload a photo with his problems.delhi fortis hospital doctors respond to arun. they come forward to operation .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X