వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు: చిన్నారికి తీవ్ర గాయాలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో బుధవారం వరుస పేలుళ్లు సంభవించాయి. రెండు వరుసు పేలుళ్లతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంఫాల్ ఈస్ట్‌లోని బీఎస్ఎస్ క్యాంప్‌కు అతి సమీపంలో ఐఈడీ పేలింది.

ఈ బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో పేలుళ్లలో ఏడేళ్ల టినోయ్ అనే బాలిక గాయపడింది. మోయిరాంగ్‌ పురెల్‌ గ్రామంలో ఈ పేలుడు జరిగిందని.. గాయపడిన పాపను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ వెల్లడించారు.

One injured in twin blasts in Manipur

తాజాగా మళ్లీ రెండోసారి మధ్యాహ్నాం మణిపూర్ యూనివర్సిటీ గేటు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదు తీవ్ర గాయాలు పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెవలియాల్సి ఉంది. పేలుళ్ల కారణంగా పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మోహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను పెంచి ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. పేలుళ్లకు సంబంధించి కార‌ణాలపై ఆరా తీస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ఉగ్రవాదులు దేశంలో విధ్వంసం సృష్టించే క్రమంలో ఈ పేలుళ్లకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

English summary
A child was injured in an IED explosion near a BSF camp while a low-intensity blast caused panic near the Manipur University gate in Imphal East and Imphal West districts respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X