వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో బాంబు పేలుడు: బాలుడి మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నాగర్ బజార్‌లో మంగళవారం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో పదేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈ బాంబు పేలింది.

నాగర్ బజార్లోని ఇరుకు భవనమైన డమ్ డమ్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణంలోని ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్రజలు భయానికి గురై, పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

One killed, nine injured in blast in Kolkata’s Nagerbazar area

పేలుడు జరిగిన ప్రాంతం సమీపంలో డమ్ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ కార్యాలయం ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఇది ప్లాన్‌తో జరిగిన ఘటన అని, తనను చంపేందుకు ఈ బాంబు దాడి చేశారని, దీని వల్ల భయం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పోలీసులు స్పందిస్తూ... ఎక్కువ తీవ్రత కలిగిన పేలుడు సంభవించిందని, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని, పదిమందికి స్వల్ప గాయాలయ్యాయని, గన్ పౌడర్ లాంటిది కనిపించలేదని, పేలుడుకు గల కారణాలు గుర్తించాల్సి ఉందని చెప్పారు. పేలుడు ప్రాంతంలో కొన్ని ఇనుప ముక్కలు లభ్యమయ్యాయని చెప్పారు.

English summary
A low intensity socket bomb explosion in Kolkata killing an eight year old has sparked political controversy in West Bengal. At least 9 people, including the child’s mother has been injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X