వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతును పెళ్లాడితే వ‌ధువుకు ల‌క్ష బ‌హుమ‌తి..! క‌ర్ణాట‌క‌లో వినూత్న ప్ర‌యోగం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంత సులువుగా జ‌ర‌గ‌డం లేదు. అమ్మాయిల‌కు అబ్బాయిలు, అబ్బాయిల‌కు అమ్మాయిలు ఓ ప‌ట్టాన న‌చ్చ‌డం లేదు. దీంతో స‌కాలంలో పెళ్లిళ్లు కాక చాలా మంది అబ్బాయిలు పుళ్లి కాని ప్ర‌సాదుల్లా మిగిలిపోతున్నారు. ఇక గ్రామీణ వాతావ‌ర‌ణంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది. అందుకోసం కార్ణాట‌క‌లో ఓ గ్ర‌మాంలో పెద్ద‌లు ఓ వినూత్న ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. గ్రామ‌స్తులు అమ‌లు చేసిన ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కాండంతో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు త‌నకు కాబోయే భ‌ర్త రైతు కావాల‌ని కోరుకుంటున్నారాట‌..!

క‌ర్ణాట‌క‌లో పెళ్లి కాని ప్ర‌సాదుల‌కు మంచి రోజులు..! రైతును పెళ్లి చేసుకుంటే ల‌క్ష బ‌హుమ‌తి..!!

క‌ర్ణాట‌క‌లో పెళ్లి కాని ప్ర‌సాదుల‌కు మంచి రోజులు..! రైతును పెళ్లి చేసుకుంటే ల‌క్ష బ‌హుమ‌తి..!!

పెళ్లి చేసుకోవాలంటే సవా లక్ష కండీషన్స్ పెడుతున్నారు ఇరువ‌ర్గాల వారు. గతంలో అయితే అబ్బాయి మంచోడా? మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోగలడా? అని మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.ముఖ్యంగా ఏం ఉద్యోగం చేస్తున్నావ్? ఎంత సంపాదిస్తున్నావ్? అని అడిగేవారు కామన్ అయిపోయారు. మరి అందరూ ఉద్యోగమే అడిగితే దేశానికి వెన్నెముఖైన వ్యవసాయం చేసే రైతు ప‌రిస్తితి ఏంటి.? అందుకే వినూత్నంగా ఆలోచించి అమ్మాయి వైపు వారిని ఆకర్షిస్తున్నారు కర్ణాటకలోని ‘అనగోడు సేవా సహకార సంఘం' వారు. వినడానికి వింతగా ఉన్నా, రైతును పెళ్లి చేసుకున్న అమ్మాయికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు.

 రైతును ఎలా పెళ్లి చేసుకోవాలి..! కాని లక్ష ఇస్తామంటే ఓకే అంటున్న అమ్మాయిలు..!!

రైతును ఎలా పెళ్లి చేసుకోవాలి..! కాని లక్ష ఇస్తామంటే ఓకే అంటున్న అమ్మాయిలు..!!

ఇక అనగోడు అనేది ఉత్తర కర్ణాటకలోని ఓ చిన్న గ్రామం. ఇక్కడ వక్కచెట్లు, వరి బాగా పండుతుంది. స్థానిక రైతులంతా పంటలు పండించే మంచి లాభాలు సంపాదిస్తుంటారు. దీంతో యువత కూడా వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలు సాగుచేస్తూ ఉద్యోగాల వైపు చూడటం లేదు. కానీ రైతులైన యువకులకు పిల్లను ఇవ్వకపోవటం ఇక్కడ ఓ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని వారు ఒక వినూత్న ఆలోచనకు వచ్చి దేశవ్యాప్తంగా తమ ఊరి పేరు మారుమోగేలా చేశారు.

 క‌ర్ణాట‌క‌లో అనగోడు సహకారం సంఘం వినూత్ర ప్ర‌యోగం..! ఆక‌ర్శితులౌతున్న అమ్మాయిలు..!!

క‌ర్ణాట‌క‌లో అనగోడు సహకారం సంఘం వినూత్ర ప్ర‌యోగం..! ఆక‌ర్శితులౌతున్న అమ్మాయిలు..!!

అనగోడు సహకారం సంఘం పేరుతో ఓ సంఘం ఏర్పాటు చేసిన ఇక్కడి జనం, 2000 మందిని సభ్యులుగా చేర్చుకొని వినూత్నమైన ఆలోచన చేశారు. ఇప్పటికే ఈ సహకార సంఘం ద్వారా నిత్యావసరాల నుంచి పశువులా దాకా అన్నింటిని సబ్సిడీ మీద ఇప్పించి గొప్ప విజయం సాధించిన వీరు.. ఇప్పుడు పెళ్లికాని యువ రైతుల కోసం సరికొత్త పథకం వెలుగులోకి తీసుకొచ్చారు. పెళ్లి కాని రైతులను చేసుకునే యువతులకు లక్ష రూపాయలు కానుకగా ఇస్తామని ప్రకటించి దేశంలోనే సంచలనం అయ్యారు. ఏప్రిల్ 1 నుంచి పెళ్లి కాని రైతులను చేసుకునే ఈ అమ్మాయిలకు ఈ పథకం వర్తిస్తుందట.

రైతుల‌కు మంచి రోజులు..! పెళ్లి చేసుకోవ‌డానికి ఓకే అంటున్న అమ్మాయిలు..!!

రైతుల‌కు మంచి రోజులు..! పెళ్లి చేసుకోవ‌డానికి ఓకే అంటున్న అమ్మాయిలు..!!

వినూత్నంగా వాళ్ళు చేసిన ఈ ఆలోచనతో పిల్లనిచ్చే అమ్మాయి వైపు వాళ్ళు ముందుకు వస్తున్నారట. అంటే.. చూశారా! ఒక్క ఆలోచనతో ఎంత మార్పు వస్తోందో! మరి మన ప్రభుత్వాలెందుకు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయవు అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మొత్తానికి రైతును పెళ్లి చేసుకుంటే ల‌క్ష బ‌హుమ‌తి ప‌థ‌కం గురించి క‌ర్ణాట‌క‌లో పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Anagoda is a small village in north Karnataka. Local farmers earn good profits from crops. As a result, youth are not farming commercial crops and looking for jobs. But it is a problem here for not giving the brides to farmers. The 'Anogodu Seva Cooperative Society' in Karnataka is giving a gift of Rs 1 lakh to a girl who is married to the farmer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X