వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే నెలలో రెండుసార్లు ప్రసవం, ముగ్గురు పిల్లల జననం

|
Google Oneindia TeluguNews

ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు, లేదంటే ఐదుగురు పిల్లలు జన్మించడం సాధారణమే , కాని ఒకే నెలలో రెండు సార్లు ప్రసవించడం ముగ్గురు పిల్లలు పుట్టడం ఎప్పుడు మీరు విని ఉండరు. అది జరగడం సాధ్యం కాదు కూడా ..కాని బంగ్లాదేశ్ లో ఈ వింత సంఘటన జరిగింది.

ఆధునిక పరిజ్జానం అయినా నిర్లక్ష్యం

ఆధునిక పరిజ్జానం అయినా నిర్లక్ష్యం

ఆధునిక పరిజ్జానం పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ప్రసవాలు చాల ఇజీగా జరుగుతున్నాయి,గర్భంలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు ,ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది అని చూసే ఆధునిక టెక్నాలజీ ఉంది..కాని బంగ్లాదేశ్ లోని ఓ మహిళ గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్న ఆమేను పరీశీలించిన డాక్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆ నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రసవించి మొదటి సారి ఒకరికి రెండో సారి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

బంగ్లాదేశ్ లో వింత సంఘటన

బంగ్లాదేశ్ లో వింత సంఘటన

బంగ్లాదేశ్ నైరుతీ ప్రాంతంలోని జస్సోర్ జిల్లాకు చెందిన అరిఫా సుల్తానా అనే వివాహిత కోన్ని రోజుల క్రితం ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా , మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 26 రోజుల్లోనే మరోసారి పెయిన్స్ రావడంతో గత శుక్రవారం అసుపత్రికి వచ్చింది.దీంతో ఆమేను డాక్టర్లు పరీక్షించారు. అయితే మహిళ గర్భంలో ఇద్దరు పిల్లలు (అమ్మాయి, అబ్బాయి ) ఉండడం గమనించి డాక్టర్లు షాక్ కు గురయ్యారు. దీంతో పిల్లలను ఆపరేషన్ చేసి బయటకు తీశారు.ప్రస్తుతం తల్లీ బిడ్డా , క్షేమంగా ఉండడంతో వారిని రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు పేర్కోన్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం

డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం

అయితే ఈ విషయం గురించి అక్కడి జెస్సోర్ ప్రభుత్వాసుపత్రి చీఫ్ దిలీప్ రాయ్ మాట్లాడుతూ.. ,మొదటి సారి డెలివరి చేసినప్పుడు ఈ విషయాన్ని గమనించకుండా నిర్లక్ష్యంతో డెలివరి చేయడంతోనే ఇలా జరిగిందని, సంబంధిత ఖుల్నా అసుపత్రి వైద్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ సంధర్భంలోనే నా సర్వీసులో ఇలాంటి సంఘటన చూడలేదని ఆయన వెల్లడించారు.

అతి బీద కుటుంభం

అతి బీద కుటుంభం

అయితే తన భర్త నెలకు ఆరువేలు మాత్రమే సంపాదిస్తాడని ,దాంతో పిల్లలను ఎలా పోషించాలని సుల్తానా అవేదన చెందింది అయితే ఆమే భర్త మాత్రం పిల్లలను అల్లా ఇచ్చాడు , వారిని సంతోషంగా ఉంచేందుకు కృషి చేస్తానని చిరునవ్వుతో చెప్పారు.

English summary
A Bangladeshi mother has stunned doctors by giving birth to healthy twins 26 days after a first child was born prematurely.Arifa Sultana, 20, gave birth to a baby boy last month through normal delivery, but doctors missed the presence of a second uterus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X