బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రబుల్ షూటర్ కు మరోసారి చిక్కులు, ఆరు ఏళ్ల అక్రమ మైనింగ్ కేసు రీ ఓపెన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆరు సంవత్సరాల క్రితం సమర్పించిన పీఐఎల్ ఇప్పుడు విచారణకు రావడంతో మాజీ మంత్రి డీకే. శివకుమార్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !

మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చెయ్యడంతో డీకే. శివకుమార్ విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం సమర్పించిన పీఐఎల్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎఎన్. ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం నవంబర్ 30వ తేదీ లోపు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

One More Trouble For DK Shivakumar And His Brother DK Suresh. Six Year Back Stone Mining Case Reopened.

కనకపుర, సాతనూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ గనులు (బ్లాక్ స్టోన్ మైనింగ్) నిర్వహించారని, అటవి భూములు కబ్జా చేశారని ఆరు సంవత్సరాల క్రితం కేసు నమోదైయ్యింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజక వర్గం ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ మీద ఆరోపణలు రావడంతో కేసు నమోదైయ్యింది.

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !

కనకపురకు చెందిన స్థానికులు 2013లో ప్రజా ప్రయోజనాల పిటిషన్ దాఖలు చేసి కేసు సీబీఐతో విచారణ చేయించాలని కోర్టులో మనవి చేశారు. ఆ అర్జీ విచారణ ఇప్పుడు జరిగింది. అటవి శాఖ అధికారులు మాజీ మంత్రి డీకే. శివకుమార్ తో కుమ్మక్కు అయ్యారని అర్జీదారులు ఆరోపించారు.

ఇప్పుడు ఈ పిటిషన్ విచారణకు రావడంతో అటవి శాఖ అధికారులతో సహ ఎవరెవరు తప్పు చేశారు అనే పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్, ఆయన భార్య ఉషా, డీకే. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

English summary
Bengaluru: One More Trouble For DK Shivakumar And His Brother DK Suresh. Six Year Back Stone Mining Case Reopened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X