వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రపంచదేశాల సరసన ఒక భాష ద్వారానే భారత్‌ను ఫోకస్ చేయొచ్చని చెప్పారు. హిందీ దివాస్ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. దేశవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాష హిందీ అని ఈ భాషతోనే దేశం మొత్తాన్ని ఏకం చేయొచ్చని చెప్పారు. అంతేకాదు హిందీని ప్రాథమిక భాషగా చేయాలన్న ఆయన... భారత్‌ను బయట ఫోకస్ చేసేందుకు భాష ఉపయోగపడుతుందని చెప్పారు.

భారత్‌లో చాలా భాషలు ఉన్నాయని ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందని చెప్పిన కేంద్రహోంశాఖ మంత్రి... భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని అది అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ఉండాలని చెప్పారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌లు కన్న కలలను సాకారం చేసేందుకు దేశ ప్రజలు హిందీని విరివిగా మాట్లాడటం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

One Nation One Language:Amit Shah bats for Hindi as Indias identity

Recommended Video

అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్

ఇదిలా ఉంటే హిందీ దివాస్ సందర్భంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో అత్యధిక ప్రజలు హిందీ మాట్లాడుతారని అదే సమయంలో అతి సులభంగా అర్థం చేసుకోగల భాష హిందీ అని కొనియాడారు. దైనందిత జీవితంలో హిందీని విరివిగా వినియోగించాలని పిలుపునిచ్చారు. హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. హిందీ రచయితలకు, కవులకు, జర్నలిస్టులకు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో హిందీ భాషను దేశ అధికారిక భాషగా చేర్చిన రోజున హిందీ దివాస్ జరుపుకుంటున్నాము.

English summary
Home Minister Amit Shah on Saturday stressed on the ability of the Hindi language to unite the country and said that it is necessary to have one language which could represent India in the world. On the occasion of Hindi Diwas, Amit Shah said that widely-spoken Hindi is the language which can keep India united.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X