వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ నేషన్ వన్ కార్డ్... ఎన్‌సీఎంసీని లాంచ్ చేసిన మోదీ.. ఈ కార్డుతో పొందే బెనిఫిట్స్ ఇవే...

|
Google Oneindia TeluguNews

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్,వన్ నేషన్ వన్ ఎలక్షన్,వన్ నేషన్ వన్ మార్కెట్... ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ముందడుగు వేసింది. మంగళవారం(డిసెంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించిన సందర్భంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(ఎన్‌సీఎంసీ)ను కూడా లాంచ్ చేశారు. 'వన్ నేషన్ వన్ కార్డు' నినాదంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నందన్ నిలేకని ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు 'ఎన్‌సీఎంసీ'ని అమలులోకి తీసుకొచ్చారు.

అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్ అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్

ఢిల్లీ మెట్రో కార్పోరేషన్‌లోని మెజెంటా లైన్‌లో తొలి డ్రైవర్‌ రహిత రైలును ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో నగరీకరణను ఒక సవాల్‌గా కాకుండా అవసరంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం సరళీకృత,ఏకీకృత సాంకేతిక విధానాలను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సేవల ద్వారా నగర ప్రజల జీవితాలు మరింత మెరుగుపడుతాయని చెప్పారు.

One nation, one mobility card PM Modi Launches NCMC Know Benefits Of The Card

తాజాగా మోదీ ప్రారంభించిన డ్రైవర్ రహిత మెట్రో రైలు ఢిల్లీ కార్పోరేషన్ (డీఎంఆర్‌సీ)‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్‌-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య మొత్తం 37 కిలోమీటర్ల మేర నడవనుంది. 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

కళ్లతోనే మత్తెక్కిస్తున్న నందితా శ్వేత.. పడక గది ఫోటోషూట్‌తో సంచలనం

కాగా,ఎన్‌సీఎంసీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే అన్ని రవాణా సౌకర్యాలకు ఇదొక కామన్ కార్డు. దీని ద్వారా మెట్రోతో పాటు సబర్బన్ రైళ్లు,బస్సుల్లో ప్రయాణించేందుకు క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఈ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అంతేకాదు,దీన్ని మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్ నుంచే చెల్లింపులు కూడా చేయవచ్చు. మెట్రో స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్ద ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్(AFC) ద్వారా చెల్లింపులు జరపవచ్చు. మెట్రో స్టేషన్‌లోకి ఎంట్రీ,ఎగ్జిట్ కూడా మొబైల్ ఫోన్‌తోనే లింక్ అవుతాయి.

ఎన్‌సీఎంసీ విధానం ద్వారా రైళ్లు,బస్సుల్లో చెల్లింపుల కోసం రూపే,డెబిట్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి ఏఎఫ్‌సీ గేట్ వద్ద స్వైప్ చేయడం ద్వారా ప్రయాణానికి సంబంధించిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. గత 18 నెలల్లో దేశంలోని 23 బ్యాంకులు జారీ చేసిన ఏ రూపే కార్డుతోనైనా ఈ సదుపాయం పొందవచ్చు. సంబంధిత బ్యాంకులో ఎన్‌సీఎంసీ సదుపాయంతో లభించే రూపే-వన్ నేషన్ వన్ కార్డును ఎవరైనా పొందవచ్చు.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది.

English summary
The idea of a single card to fulfill all your travel needs has become a reality now! Prime Minister Narendra Modi has launched the National Common Mobility Card (NCMC) for the Delhi Metro on Monday. The newly launched NCMC card comes under PM Modi’s ambitious Digital India initiative to push the country towards being a cashless economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X