ఒక్క కుటుంభం కోసం ప్రత్యేక పోలీంగ్ బూత్... ప్రత్యేక బస్... !
సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్క ఓటు కోసం నాయకులు ఏ మేరకు తంటాలు పడతారో మనకు తెలుసు, ఒక్కో ఓటరను ప్రసన్నం చేసుకునేందుకు పలుసార్లు ఆయా కుటుంభాల వద్దకు వెళతారు. ఎందుకంటే.. ఒక్కోసారి ఒక్క కూడ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుంది. ఈ వీక్‌నెస్ తో నాయకులు ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఒక్క ఓటు ఉంటేనే వంగివంగి దండాలు పెట్టే నాయకత్వం ఉన్న ప్రస్థుత రోజుల్లో... ఒక్క ఇంట్లో 66 ఓట్లు ఉంటే వారి పరిస్థితి ఏమిటి..వాళ్లను ఎన్నికల సమయంలో నాయకులు ఎలా చూస్తారో అందరికి తెలుసు. అచ్చు అలాంటీ పరిస్థితే జరుగుతుంది అలహాబాద్ లోని ఓ గ్రామంలో...

అలహాబాద్ లోని బహ్రేచాలో ఒక్క ఇంట్లో 82 మంది సభ్యులు 66 ఓట్లు
అలహాబాద్ లోని బహ్రెచా గ్రామంలో ఒక్క కుటుంభంలో మొత్తం 82 సభ్యులు ఉంటారు. అయితే వీరిదంతా ఉమ్మడి కుటుంభం కాగా ఆ కుటుంభ పెద్దగా 98 సంవత్సరాల రామ్ నరేష్ అనే పెద్దాయన ఉంటాడు. కాగా వీరు ఒకే ఇంట్లో ఉంటూ ఉమ్మడి జీవీతాన్ని గడుపుతున్నారు. అయితే ఇంట్లో 82 మంది కుటుంభసభ్యులు ఉండగా అందులో ఇద్దరు మాత్రం ఉద్యోగ రిత్యా ముంబాయిలో ఉంటున్నారు. కాగా మొత్తం 82 మంది కుటుంభ సభ్యుల్లో మాత్రం 66మందికి ఓటు హక్కు ఉంది. అందులో ఎనిమిది మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది.

ఓట్ల పండగ వస్తే ఇళ్లంతా సందడి...
ఇంకేముంది అరవైమందికి ఓటు ఉందంటే రాజకీయనాయకులకు అంతమందిని ఒకేసారి కలిసే అవకాశం వస్తుంది. దీంతో ఓటును అడిగేందుకు ప్రతినాయకుడు వాళ్ల ఇంటికి వెళతాడనంలో సందేహం లేదు. ఇలా ప్రతి ఎన్నికల సంధర్భంలో కూడ రామ్ నరేష్ ఇళ్లు సందడిగా నెలకొంటుంది. వీరంతా ఆరవ దశ పోలింగ్ లో ఓటువేయబోతున్నారు. అయితే అందులో కొత్తగా 8మందికి ఓటు హక్కుకల్గింది దీంతో వారంత ఉత్సుకతతో ఉన్నారని రామ్ నరేష్ చెబుతున్నారు.

కుటుంభం కోసం ప్రత్యేక బూత్..
ఇక 66 ఓట్లు ఉన్న రాంనరేష్ కుటుంభం కోసం ఎన్నికల అధికారులు ఒక ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు కుటుంభ సభ్యులను ప్రత్యేకంగా తీసుకెళ్లేందుకు ఒక బస్సుకూడ వెళుతుంది. ఇక అందరు కుటుంభ సభ్యులు కలిసి ఓటు వేసేందుకు విధిగా వెళుతుండడంతో వారికి ఎన్నికల అధికారులు కూడ సాధరంగా ఆహ్వానిస్తారు. దీంతో ఆయన కుటుంభ సభ్యులంతా చాల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

రోజుకు 15 కిలోల వంట..
రామ్ నరేష్ ది ఉమ్మడి కుటుంభం కావండతో అందరిది వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగుతోంది. ఇక వీరంతా ఒకే ఇంట్లో కలిసి ఉండడంతో వారికి రోజుకు15 కిలోల రైస్ తోపాటు 20 కిలోల కూరగాయాలు వండడడంతోపాటు మరో పది కిలోల రెట్టేలు సైతం చేస్తారు. ఇక అందరికి కలిపి ఒకే వంటశాలలో భోజనాలు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంభంలో ఏ ఒక్కరు విడిగా ఉండాలని కోరుకోరని ,ఇలాగే మొత్తం కుటుంభాలు ఉండాలని తాను కోరకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఇంతమంది ఉన్నా ఆసరా మాత్రం శూన్యం
అయితే ఇంతమంది ఒకే సారి ఓటు వేసి నాయకుల గెలుపుకు కృషి చేస్తే మాత్రం నాయకులు తమ పనులను పట్టించుకోరని ,ఎన్నికల ముందు ఎన్ని హమీలు ఇచ్చినా వాటిని అమలు చేయరని వాపోతున్నారు. ఇంత పెద్ద ఇంటికి నాయకులు ఓట్లు వేయించుకునేందుకు క్యూ కట్టిన నాయకులు ఓట్ల తదంనంతరం పట్టించుకోరని అంటున్నారు. ముఖ్యంగా వారి ఇళ్లు మట్టి గోడల ఇళ్లు కావడంతో దాన్ని పునర్మిణం చేసుకునేందుకు సహకరించాలని ,ఇంట్లో అడపిల్లలకు కూడ ప్రత్యేక గదులు లేవని చెబుతున్నారు.ఇక ఇంటిపై నుండి విద్యుత్ వైర్లు పోయిన నేపథ్యంలో వాటిని తొలగించాలని చెప్పినా పట్టించుకోరని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైన అంత పెద్ద ఉమ్మడి కుటుంభాలు ఉండడం అది కూడ ఈరోజుల్లో ఎలాంటీ ఇబ్బందులు లేకుండా కొనసాగడం ఆనందించదగ్గ విషయమే ,నాయకులు అలాంటీ వారికి భరసో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications