వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క కుటుంభం కోసం ప్రత్యేక పోలీంగ్ బూత్... ప్రత్యేక బస్... !

|
Google Oneindia TeluguNews

సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్క ఓటు కోసం నాయకులు ఏ మేరకు తంటాలు పడతారో మనకు తెలుసు, ఒక్కో ఓటరను ప్రసన్నం చేసుకునేందుకు పలుసార్లు ఆయా కుటుంభాల వద్దకు వెళతారు. ఎందుకంటే.. ఒక్కోసారి ఒక్క కూడ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుంది. ఈ వీక్‌నెస్ తో నాయకులు ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఒక్క ఓటు ఉంటేనే వంగివంగి దండాలు పెట్టే నాయకత్వం ఉన్న ప్రస్థుత రోజుల్లో... ఒక్క ఇంట్లో 66 ఓట్లు ఉంటే వారి పరిస్థితి ఏమిటి..వాళ్లను ఎన్నికల సమయంలో నాయకులు ఎలా చూస్తారో అందరికి తెలుసు. అచ్చు అలాంటీ పరిస్థితే జరుగుతుంది అలహాబాద్ లోని ఓ గ్రామంలో...

అలహాబాద్ లోని బహ్రేచాలో ఒక్క ఇంట్లో 82 మంది సభ్యులు 66 ఓట్లు

అలహాబాద్ లోని బహ్రేచాలో ఒక్క ఇంట్లో 82 మంది సభ్యులు 66 ఓట్లు


అలహాబాద్ లోని బహ్రెచా గ్రామంలో ఒక్క కుటుంభంలో మొత్తం 82 సభ్యులు ఉంటారు. అయితే వీరిదంతా ఉమ్మడి కుటుంభం కాగా ఆ కుటుంభ పెద్దగా 98 సంవత్సరాల రామ్ నరేష్ అనే పెద్దాయన ఉంటాడు. కాగా వీరు ఒకే ఇంట్లో ఉంటూ ఉమ్మడి జీవీతాన్ని గడుపుతున్నారు. అయితే ఇంట్లో 82 మంది కుటుంభసభ్యులు ఉండగా అందులో ఇద్దరు మాత్రం ఉద్యోగ రిత్యా ముంబాయిలో ఉంటున్నారు. కాగా మొత్తం 82 మంది కుటుంభ సభ్యుల్లో మాత్రం 66మందికి ఓటు హక్కు ఉంది. అందులో ఎనిమిది మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది.

ఓట్ల పండగ వస్తే ఇళ్లంతా సందడి...

ఓట్ల పండగ వస్తే ఇళ్లంతా సందడి...

ఇంకేముంది అరవైమందికి ఓటు ఉందంటే రాజకీయనాయకులకు అంతమందిని ఒకేసారి కలిసే అవకాశం వస్తుంది. దీంతో ఓటును అడిగేందుకు ప్రతినాయకుడు వాళ్ల ఇంటికి వెళతాడనంలో సందేహం లేదు. ఇలా ప్రతి ఎన్నికల సంధర్భంలో కూడ రామ్ నరేష్ ఇళ్లు సందడిగా నెలకొంటుంది. వీరంతా ఆరవ దశ పోలింగ్ లో ఓటువేయబోతున్నారు. అయితే అందులో కొత్తగా 8మందికి ఓటు హక్కుకల్గింది దీంతో వారంత ఉత్సుకతతో ఉన్నారని రామ్ నరేష్ చెబుతున్నారు.

కుటుంభం కోసం ప్రత్యేక బూత్..

కుటుంభం కోసం ప్రత్యేక బూత్..

ఇక 66 ఓట్లు ఉన్న రాంనరేష్ కుటుంభం కోసం ఎన్నికల అధికారులు ఒక ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు కుటుంభ సభ్యులను ప్రత్యేకంగా తీసుకెళ్లేందుకు ఒక బస్సుకూడ వెళుతుంది. ఇక అందరు కుటుంభ సభ్యులు కలిసి ఓటు వేసేందుకు విధిగా వెళుతుండడంతో వారికి ఎన్నికల అధికారులు కూడ సాధరంగా ఆహ్వానిస్తారు. దీంతో ఆయన కుటుంభ సభ్యులంతా చాల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

రోజుకు 15 కిలోల వంట..

రోజుకు 15 కిలోల వంట..

రామ్ నరేష్ ది ఉమ్మడి కుటుంభం కావండతో అందరిది వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగుతోంది. ఇక వీరంతా ఒకే ఇంట్లో కలిసి ఉండడంతో వారికి రోజుకు15 కిలోల రైస్ తోపాటు 20 కిలోల కూరగాయాలు వండడడంతోపాటు మరో పది కిలోల రెట్టేలు సైతం చేస్తారు. ఇక అందరికి కలిపి ఒకే వంటశాలలో భోజనాలు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంభంలో ఏ ఒక్కరు విడిగా ఉండాలని కోరుకోరని ,ఇలాగే మొత్తం కుటుంభాలు ఉండాలని తాను కోరకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఇంతమంది ఉన్నా ఆసరా మాత్రం శూన్యం

ఇంతమంది ఉన్నా ఆసరా మాత్రం శూన్యం

అయితే ఇంతమంది ఒకే సారి ఓటు వేసి నాయకుల గెలుపుకు కృషి చేస్తే మాత్రం నాయకులు తమ పనులను పట్టించుకోరని ,ఎన్నికల ముందు ఎన్ని హమీలు ఇచ్చినా వాటిని అమలు చేయరని వాపోతున్నారు. ఇంత పెద్ద ఇంటికి నాయకులు ఓట్లు వేయించుకునేందుకు క్యూ కట్టిన నాయకులు ఓట్ల తదంనంతరం పట్టించుకోరని అంటున్నారు. ముఖ్యంగా వారి ఇళ్లు మట్టి గోడల ఇళ్లు కావడంతో దాన్ని పునర్మిణం చేసుకునేందుకు సహకరించాలని ,ఇంట్లో అడపిల్లలకు కూడ ప్రత్యేక గదులు లేవని చెబుతున్నారు.ఇక ఇంటిపై నుండి విద్యుత్ వైర్లు పోయిన నేపథ్యంలో వాటిని తొలగించాలని చెప్పినా పట్టించుకోరని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైన అంత పెద్ద ఉమ్మడి కుటుంభాలు ఉండడం అది కూడ ఈరోజుల్లో ఎలాంటీ ఇబ్బందులు లేకుండా కొనసాగడం ఆనందించదగ్గ విషయమే ,నాయకులు అలాంటీ వారికి భరసో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.

English summary
There is combined family which have 66 votes in allahabad which is going to held 6th phase on sunday , so polling officers set up a separate polling booth for a single family in allahabad state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X