వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఎన్నో తెలుసా? వాటిలో జైషే మహ్మద్ సంస్థ షేర్ ఎంతో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు భారత్ కు చెందిన సీనియర్ అధికారి చెప్పిన వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి. పాకిస్థాన్ లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లు 22 ఉన్నాయట. అందులో జైషే మహ్మద్ సంస్థకు చెందినవి 9 ఉన్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఆ సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

<strong>అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!</strong>అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!

one senior indian officer said that 22 terrorists training centres in pakistan, jaishe mohammed having 9

ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే గాకుండా ఉద్రిక్తత మరింత పెంచే దిశగా పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన సదరు అధికారి.. పాకిస్థాన్ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు. ఇటీవల పలు టెర్రరిస్టు సంస్థలకు చెందిన నేతలను పాకిస్థాన్ గృహనిర్భందం చేయడం లాంటి చర్యలను డ్రామాగా కొట్టిపారేశారు. భారత్ లో ఉగ్రదాడుల అనంతరం ప్రతిసారి ఇలాగే చేస్తుందంటూ ధ్వజమెత్తారు. గృహనిర్భందం పేరుతో వారికి సకల సదుపాయాలు అందిస్తుందని చెప్పుకొచ్చారు. పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ వారిని స్వేచ్ఛాజీవులుగా విడిచిపెడుతుందని వివరించారు. సరిహద్దుల్లో ఇప్పటికీ పాక్ ఉగ్రవాదులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. అవి శ్రుతిమించితే బాలకోట్ వైమానిక దాడుల లాంటివి భారత్ మరిన్ని రుచి చూపిస్తుందని హెచ్చరించారు.

English summary
Do you know the how many terrorist training centers in Pakistan. Do you know that Jaisheeh Mohammad Company share? The details of the senior officer of India are in awe of such questions. Pakistan has terrorist training centers 22. The official said that Jaisheeh Mohammed's company had 9. The Pakistani government does not take any action on those institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X