వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా.. మరణం నుంచి 80శాతం తప్పించుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే.. కరోనా బాధితులను 80 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు, రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని వెల్లడించింది.

వాస్తవిక పరిస్థితులను బట్టి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మరణాలను తగ్గిస్తుందని పీహెచ్ఈ పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది.

One shot of Covishield vaccine reduces death risk by 80%, shows new data

వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది, ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించింది. కరోనా బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన అధ్యయనంలో వెల్లడించింది.

ఇక ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనా వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా.. మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ తెలిపింది.

Recommended Video

Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

కరోనా కేసులు అదుపులోకి రావడంతో ఇంగ్లాండ్ దేశంలో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రధానమంత్రి బోరీస్ జాన్సన్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం ద్వారా 80ఏళ్లకుపైబడినవారు 93 శాతం ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోందని మరో అధ్యయనం తేల్చింది.

English summary
Data from the rollout of AstraZeneca's Covid-19 vaccine shows one dose of the shot results in 80% less risk of death from the disease, Public Health England said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X