• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌పై అస్త్రాలుగా టిబెట్ యువత -ఇంటికొకరి సైన్యంలో చేర్చుకుంటోన్న డ్రాగన్ చైనా

|

పొరుగుదేశాలకు నిత్యం పొగబెట్టే డ్రాగన్ చైనా తన పక్కనున్న టిబెట్ ను పూర్తిగా ఆక్రమించడమే కాకుండా, అక్కడి వారికి దలైలామా శాంతి బోధనలకు బదులు భారత్ పై విషాన్ని నూరిపోసే పనిచేస్తున్నది. గతవారం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తొలిసారిగా టిబెట్ లో పర్యటించిన తర్వాత ఆ కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది..

జగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామజగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామ

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి వాతావరణం, భారత్ నుంచి ప్రతిఘటన దృష్ట్యా చైనా సన్యం ఇబ్బందులు పడుతున్న క్రమంలో.. భారత సరిహద్దులో కార్యకలాపాల కోసం చైనా ఇప్పుడు టిబెట్ యువతను సైన్యంలోకి చేర్చుకుంటున్నది. ప్రతి ఇంటికి కనీసం ఒకరు చొప్పున చైనా సైన్యంలో చేరాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.

One soldier per family: China PLA recruiting Tibetan youth for deployment at LAC

టిబెట్ యూత్‌కు ఫిజికల్ టెస్టులు నిర్వహించి వారిని పీఎల్‌ఏలోకి తీసుకునే ప్రక్రియను చైనా వేగవంతం చేసిందని సమాచారం. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే లదాక్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా సైన్యాన్ని మోహరించాలని చైనా యోచిస్తోంది. టిబెట్‌లో తమకు విశ్వాసంగా ఉండే వ్యక్తుల కుటుంబాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిని ఆర్మీలోకి రిక్రూట్ చేసుకునే ప్రక్రియను చైనా ఆరంభించిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

ఎల్‌ఏసీ వెంబడి స్పెషల్ ఆపరేషన్ కోసం టిబెట్ యువతను రిక్రూట్ చేసుకొని, వారికి ప్రత్యేక శిక్షణఇస్తున్నారని సమాచారం. కాగా, భారత్ కూడా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్) పేరిట టిబెట్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులతో ఓ ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి 1962 లో చైనాతో యుద్ధం తర్వాత ఆ బలగాలను ఏర్పాటు చేసిన ఆర్మీ.. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో కలిసి శిక్షణనిచ్చింది.

  Severe Flooding In China,100000 After Floods Leave 16 Dead | Oneindia Telugu

  గత ఏడాది తూర్పు లదాక లోని పాంగాస్ సరస్సు వద్ద చైనా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించింది ఈ ఎస్ఎఫ్ఎఫ్ బలగాలే. ఈ నేపథ్యంలోనే చైనా కూడా ఇదే ఎత్తుగడను అవలంబించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

  English summary
  China has made it mandatory for every Tibetan family to send one member to the People's Liberation Army (PLA) in a bid to strengthen its military deployment along the Line of Actual Control (LAC) with India. The recruitment is being made after a ‘loyalty test’ of the Tibetan youths, media reports.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X