వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఫోర్న్‌సైట్స్ చూస్తున్నారు, ఎందుకంటే?

ఫ్రీ వైఫైతో కనీసం ముగ్గురిలో ఒకరు ఇండియాలో అడల్ట్ (అశ్లీల) చిత్రాలను చూస్తున్నారని నార్టన్ సర్వే తేటతెల్లం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫ్రీ వైఫైతో కనీసం ముగ్గురిలో ఒకరు ఇండియాలో అడల్ట్ (అశ్లీల) చిత్రాలను చూస్తున్నారని నార్టన్ సర్వే తేటతెల్లం చేసింది.భారత్ హోటల్స్, ఎయిర్‌పోర్ట్, లైబ్రరీ , వర్కింగ్ ప్లేస్‌లలో ఏర్పాటుచేసిన పబ్లిక్ ఫ్రీ వైఫైలను మంచి కన్నా ఎక్కువే చెడుకు ఉపయోగిస్తున్నారని సర్వే తెలిపింది.

భారత్‌లో సగటున ముగ్గురిలో ఒక్కరైతే ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు ఫ్రీ వైఫైని దుర్వినియోగం చేస్తున్నారని నార్టన్ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ వైఫై ఆడ్మిన్‌లపై నిర్వహించిన స్టడీలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

'One In Three Indians Uses Free Wi-Fi To Watch Adult Content': Study

భారత్‌లో ఫ్రీ వైపై ఉపయోగించే వెయ్యి మంది ఆడ్మిన్‌లపై స్టడీ చేయగా ఈ విస్తుపోయే విషయం వెల్లడైంది. భారత్‌లోని వీధుల్లో ఫ్రీ వైఫై ఉపయోగించే వారిలో 31 శాతం అశ్లీల చిత్రాలు చూస్తున్నారని తేలింది.

బస్సు, రైల్వే స్టేషన్‌లలో 34 శాతం, లైబ్రీలలో 24 శాతం, ఎయిర్‌పోర్టుల్లో 34 శాతం మంది చూస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందిన నార్టన్ పేర్కొంది. సైబర్ సెక్యూర్ లేని ఫ్రీ వైఫైలతో సోషల్ మీడియాను, వ్యక్తిగత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది.

English summary
One in three Indians surveyed has admitted to having used free public Wi-Fi to watch adult content at places like hotels, airports, libraries and even workplace, says a study by Norton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X