చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి శవపేటికపై ఏం రాశారంటే: 33 ఏళ్ల క్రితం స్టాలిన్‌కు అదే మాట చెప్పారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి భౌతికకాయం ఉంచిన శవపేటికపై ముప్పై మూడేళ్ల క్రితం కొడుకు స్టాలిన్‌కు చెప్పిన మాటలను చెక్కారు. నాడు తండ్రి అతనికి ఓ మాట చెప్పారట. మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి విరామం లేకుండా పని చేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకున్నారు అని అనేంతగా పేరు తెచ్చుకోవాలని చెప్పారు. దీనినే ఇప్పుడు శవపేటికపై తమిళంలో రాశారు.

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

కాగా, కరుణానిధికి మెరీనా బీచ్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అంతిమయాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారు.

One who worked hard without rest, resting in peace here, reads Karunanidhis coffin

కాగా, కరుణానిధిని కడసారి చూసేందుకు అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలి వస్తున్నారు. ప్రజల సందర్శనార్ధం కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాల్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు మధ్యాహ్నం కాస్త అదుపు తప్పారు.

సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం

కరుణానిధికి నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు. దీంతో కరుణానిధిని దగ్గర నుంచి చూడాలని అభిమానులు చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు బారీకేడ్లు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 33 మంది వరకు గాయపడ్డారు. రాజాజీ హాల్‌ సమీపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. హాల్‌ చుట్టూ భారీగా మోహరించారు. సమీపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కరుణ పార్థివదేహం ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా తలుపులు వేసేశారు.

English summary
The golden casket in which the mortal remains of Karunanidhi would be laid to rest will have the engraving in Tamil, "Oivu edukamal uzhaithavan, idho oivu eduthu kondu irukiran, meaning "One who worked hard without taking rest, is resting in peace here".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X