వీడియో: .అటవీ ప్రాంతంలో జీపు నుంచి జారిపడ్డ ఏడాది పసిబిడ్డ: పట్టించుకోకుండా వెళ్లిన పేరెంట్స్!
తిరువనంతపురం: అర్ధరాత్రి పూట అటవీ ప్రాంతం గుండా రయ్ మంటూ దూసుకెళ్తోన్న ఓ జీపు నుంచి రోడ్డు మీదికి జారిపడిందో ఏడాది వయస్సున్న పసిబిడ్డ. వెచ్చగా తల్లి ఒడిలో నిద్రించాల్సిన పరిస్థితిలో దట్టమైన అడవుల మధ్య చిమ్మ చీకటిలో దిక్కుతోచని స్థితిలో నడి రోడ్డు మీద పాకుతూ కనిపించిందా చిన్నారి. కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ సమీపంలోని అడవుల్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ జీపు వేగంగా వెళ్లడం, ఆ చిన్నారి నడి రోడ్డ మీద పాకుతూ కనిపించడం.. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాపను గుర్తించిన వెంటనే అటవీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఆ పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం: ఆన్ లైన్ దరఖాస్తులు: వలంటీర్లకే బాధ్యత
కేరళలోని ప్రముఖ్య పర్యాటక కేంద్రం మున్నార్. పశ్చిమ కనుమల్లో పచ్చటి తివాచీ పరచుకున్నట్లు ఉంటుందీ ప్రదేశం. చుట్టూ అడవులు, ఎత్తయిన కొండల మధ్య ఉంటుంది ఈ పట్టణం. వీకెండ్ కావడంతో శనివారం వందల సంఖ్యలో సందర్శకులు మున్నార్ లో సేదతీరడానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 9:45 నిమిషాల సమయంలో సమీపంలోని అడవుల మధ్య తమిళనాడులోని ముత్తుపేట్టై వైపు నుంచి మున్నార్ దిశగా దూసుకెళ్లిందా జీపు. అందులో నుంచి ఆ చిన్నారి జారి రోడ్డు మీద పడింది. వాహనం నుంచి తమ కుమార్తె జారిపడిన విషయాన్ని గుర్తించలేదు ఆ పాప తల్లిదండ్రులు. పాప పడిపోయిందనే విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ పాప కిందికి జారిపడ్డ దృశ్యం అదే ప్రదేశంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

దీన్ని గమనించిన వెంటనే అటవీ శాఖ చెక్ పోస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే వారు సబ్ ఇన్ స్పెక్టర్ కేఎం సంతోష్ కు సమాచారం ఇచ్చారు. పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కింద పడటం వల్ల పాప తలకు గాయమైంది. పోలీసులు పాపను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన పాప తల్లిదండ్రులను గుర్తించే పనిలో పడ్డారు. పాప కింద పడ్డ విషయాన్ని అన్ని పోలీస్ స్టేషన్లకు చేరవేశారు. సీసీటీవీ ఫుటేజీని ఫొటోలుగా తీసి, అన్ని పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తమ ఏడాది వయస్సున్న కుమార్తె కనిపించట్లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో రాత్రి 11 గంటల సమయంలో ఓ కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన వెంటనే సంతోష్.. పాప తమ వద్ద ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పాప తల్లిదండ్రులకు క్షేమంగా ఆ చిన్నారిని అప్పగించారు.
#WATCH Kerala: A one-year-old child falls out of a moving car in Munnar region of Idukki district. The girl child was later rescued and handed over to the parents. (08.09.2019) pic.twitter.com/tlI7DtsgxU
— ANI (@ANI) September 9, 2019
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!