వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ భాషల్లో మన వన్ ఇండియా న్యూస్ వెబ్‌సైట్: కొత్తగా ఒడియాలోనూ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: వన్ ఇండియా.. డిజిటల్ మీడియా రంగంలో సంచలనానికి చిరునామా. హిందీ, ఇంగ్లీష్‌ సహా ఆరు ప్రాంతీయ భాషల్లో న్యూస్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సంస్థ కొత్త మరో భాషలోనూ వెబ్‌సైట్‌ను పాఠకుల కోసం ఆవిష్కరించింది. ఒడిశా భాషలో న్యూస్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇప్పటికే- హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వార్తలను అందిస్తోంది వన్ ఇండియా యాజమాన్యం. ఈ జాబితాలో తొమ్మిదో ప్రాంతీయ భాషా న్యూస్ పోర్టల్‌గా ఒడియా చేరింది. ఈ వెబ్‌సైట్ చిరునామా https://odia.oneindia.com.

ఒడిశా.. గిరిజన రాష్ట్రంగా పేరుంది. ఘన చరిత్ర గల దేవాలయాలు, అపారమైన ప్రకృతి సంపదకు నిలయం. ఖనిజ నిక్షేపాలకు పెట్టింది పేరు. విస్తారమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఇది. పూరీ జగన్నాథుడు కొలువైన పుణ్యభూమి. ఒడిశా. రాజధాని భువనేశ్వర్‌లో 800లకు పైగా ఆలయాలు ఉన్నాయి. కోణార్క్ సూర్య దేవాలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దం. తూర్పు కనుమల సౌందర్యం గురించి మాటల్లో వర్ణించలేం.

Oneindia Odia portal launched:This is the 9th language portal

పైకి కనిపించనప్పటికీ.. ఒడిస్సీలకు ఉన్న రాజకీయ పరిజ్ఙానం, ఆ రంగంపై ఉన్న అవగాహన, చైతన్యం మరెవరికీ లేదనిపిస్తుంది. ఎందుకంటే- ఒడిస్సీలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ వస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. ఇన్నేళ్లుగా ఒకే అధికార పార్టీ ఒడిశాను జనరంజకంగా పరిపాలిస్తోందనడానికి ఇదే నిదర్శనం. గుజరాత్, బిహార్ వంటి ఒకట్రెండు రాష్ట్రాలకు తప్ప మరెవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత లేదు.

Oneindia Odia portal launched:This is the 9th language portal

అలాంటి చోట వన్ ఇండియా కొత్తగా ఆ రాష్ట్ర భాషలో కొత్త న్యూస్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఒడిశాకు సంబంధించిన సమగ్ర వార్తా కథనాలను ఎప్పటికప్పుడు, అందరి కంటే ముందే అందించేలా నెట్‌వర్క్‌ను రూపొందించుకుంది. అలాంటి మానవ వనరులను సమకూర్చుకుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వార్తలను అందించడానికి ముందుకొచ్చింది - వన్ ఇండియా యాజమాన్యం. కోట్లాదిమంది పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంది ఈ వెబ్‌సైట్. కొత్తగా అడుగుపెట్టిన ఒడిశాలోనూ అతి తక్కువ కాలంలో అదే స్థాయిలో ప్రజాదరణ అందుకోవడం ఖాయం.

Oneindia Odia portal launched:This is the 9th language portal
Oneindia Odia portal launched:This is the 9th language portal
English summary
India's leading language portal One India has launched a new portal in Odia. It would be your one-stop shop for news, views, entertainment. In short, it will cover Odisha in its entirety along with national and international news as well in your favourite language Odia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X