వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: నరేంద్ర మోడీ జాగ్రత్తలు తీసుకోలేదన్న నెటిజన్లు

నోట్ల రద్దు విషయంలో కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వన్ ఇండియా చేసిన ఆన్ లైన్ సర్వేలో వెల్లడయింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు విషయంలో కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వన్ ఇండియా చేసిన ఆన్ లైన్ సర్వేలో వెల్లడయింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయమై వన్ ఇండియా 11 ప్రశ్నలతో సర్వే నిర్వహించింది.

సర్వే: పవన్-చంద్రబాబులకు మద్దతు!సర్వే: పవన్-చంద్రబాబులకు మద్దతు!

ఈ సర్వేలో ఎక్కువ మంది నెటిజన్లు రద్దును స్వాగతించారు. అయితే ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోక పోవడాన్ని మాత్రం వారు గర్హించారు. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8 రాత్రి నోట్ల రద్దు పైన ప్రకటన చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా దీని పైనే చర్చ జరుగుతోంది.

demonetisation

సర్వేలో భాగంగా పదకొండు ప్రశ్నల్లో.. ఓ ప్రశ్నగా నోట్ల రద్దు పైన కేంద్రం మందుస్తు జాగ్రత్తలు తీసుకున్నదా అని ఉంది. దానికి ఎక్కువ మంది నెటిజన్లు తీసుకోలేదని చెప్పారు. దాదాపు అరవై శాతం మంది నెటిజన్లు మోడీకి వ్యతిరేకంగా చెప్పారు. నలభై శాతం మంది మాత్రం ఇలాంటి సందర్భాల్లో ఇలాగే ఉండాలని చెప్పారు.

వన్ ఇండియా సర్వే తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మళయాలం, బెంగాళీ, గుజరాతీలలో సర్వే చేసింది. ఈ సర్వేలో 31,198 మంది పాల్గొన్నారు. ఆన్ లైన్ సర్వేలో ఇది కూడా ఓ పెద్ద సర్వే.

సర్వేలో పాల్గొన్న వారిలో 18,513 మంది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేయగా, 12,683 మంది ఇలాగే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యతిరేకంగా 59.3 శాతం మంది, అనుకూలంగా 40.7 శాతం మంది చెప్పారు.

English summary
When Prime Minister Narendra Modi announced that Rs 500 and 1,000 notes will no longer be legal tender with effect from Nov 8 midnight, little did black money hoarders realise how badly they were hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X