వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్టు ఉల్లిపాయలు హల్ చల్, హాట్ కేకుల్లా విక్రయాలు, రికార్డు స్థాయిలో ధరలు, కేజీ 180!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏషియాలో అతి పెద్ద రెండో మార్కెట్ కర్ణాటకలోని హుబ్బళి నగరంలో ఏపీఎంసీ మార్కెట్ ఉందనే పేరు ఉంది. హుబ్బళి నగరంని ఏపీఎంసీ మార్కెట్ లో ఇప్పుడు ఈజిప్టు దేశం ఉల్లిపాయలు హల్ చల్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. హుబ్బళి నగరంలో ఈజిప్టు దేశం ఎరుపు రంగు ఉల్లిపాయలు (ఎర్ర ఉల్లి) ప్రత్యక్షం అయిన క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హుబ్బళిలోని ఏపీఎంసీ మార్కెట్ లో ఎన్నడూ లేని విధంగా ఉల్లిపాయలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయని వ్యాపారులు అంటున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

క్షణాల్లో ఉల్లి ఖాళీ

క్షణాల్లో ఉల్లి ఖాళీ

హుబ్బళి నగరంలోని అమరగోగళ జగజ్యోతి బసవేశ్వర ఏపీఎంసీ మార్కెట్ లోకి ఈజిప్టు దేశానికి చెందిన ఎర్ర ఉల్లిపాయలు 25 కంటేనర్లలో తీపుకొచ్చారు. ఈజిప్టు దేశం నుంచి హుబ్బళి నగరంలోని ఏపీఎంసీ మార్కెట్ కు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నారు. ఈజిప్టు ఉల్లిపాయలు పెద్దపెద్ద సైజులో వ్యాపారులను ఆకట్టుకున్నాయి.

రికార్టు స్థాయిలో క్వింటాల్ ఉల్లి ధర !

రికార్టు స్థాయిలో క్వింటాల్ ఉల్లి ధర !

ఈజిప్టు దేశం నుంచి హుబ్బళికి దిగుమతి అయిన ఎర్ర ఉల్లిపాయలు పెద్దపెద్ద సైజులో వ్యాపారులను ఆకట్టుకున్నాయి. ఈజిప్టు దేశం ఉల్లిపాయలు చూసిన వ్యాపారులు వాటిని కొనుగోలు చెయ్యడానికి పోటీపడ్డారు. క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ. 12,000 ధర పలికింది. గత నాలుగు రోజుల క్రితం ఇదే ఈజిప్టు దేశం నుంచి దిగుమతి అయిన ఎర్ర ఉల్లిపాయలు క్వింటాల్ ధర రూ. 10,500 ధర పలికింది. అయితే శుక్రవారం ఈజిప్టు ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

వర్షాలకు ఉల్లి పంట నాశనం

వర్షాలకు ఉల్లి పంట నాశనం

ఉత్తర కర్ణాటకలో కురిసన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలు భారీ స్థాయిలో నాశనం అయ్యాయి. ఉత్తర కర్ణాటకలోని దారవాడ, హావేరి, కోప్పళ తదితర జిల్లాల్లో ఉల్లిపాయల పంటలు వేసిన రైతులు భారీగా నష్టపోయారు. పంటలు నాశం కావడంతో ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అనుకున్న స్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులో లేకపోవడం, ఉల్లి పంటలు నాశనం కావడంతో ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

నేడు ఉల్లి కేజీ ధర రూ. 180

నేడు ఉల్లి కేజీ ధర రూ. 180

బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా, హుబ్బళి తదితర నగరాల్లో నేడు (శుక్రవారం) ఉల్లిపాయలు కేజీ ధర రూ. 180 చేరింది. ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్ లో ఉల్లిపాయులు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. ఉల్లిపాయలు కొరత కారణంగా ఒక్కసారిగా వాటి ధరలు పెరిగిపోయాయి. హుబ్బళి నగరంలో ఈజిప్టు ఎర్ర ఉల్లిపాయలు కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు.

English summary
Onion imported from egypt came to apmc yard of Hubballi in Karnataka and sold as hot ghee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X