వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మార్కెట్లలో ఉల్లి ధర ఎంతో తెలుసా..?మరింత ప్రియం కానున్న కిచెన్ కింగ్

|
Google Oneindia TeluguNews

నవీ ముంబై: ఉల్లి ధర మాట వింటుంటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.100 మార్కును టచ్ చేసింది. మహారాష్ట్రలోని వషి వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది. తొలిసారిగా ఇక్కడ రూ.100 మార్కును తాకిన ఉల్లి ధరలు ఇప్పుడు ఆ మార్కును కూడా దాటి రూ.130కి పరుగులు తీస్తోంది. దీనంతటికీ మూలకారణం వాతావరణమే అని రైతులు చెబుతున్నారు.

హెల్మెట్లు వేసుకుని ఉల్లి విక్రయిస్తున్న ఉద్యోగులు, ఉల్లి కోసం ప్రజలు దేనికైనా సిద్దం, పోలీసులు !హెల్మెట్లు వేసుకుని ఉల్లి విక్రయిస్తున్న ఉద్యోగులు, ఉల్లి కోసం ప్రజలు దేనికైనా సిద్దం, పోలీసులు !

 నాణ్యత ఉన్న ఉల్లి రూ.120

నాణ్యత ఉన్న ఉల్లి రూ.120

అకాల వర్షాలతో ఉల్లి పంట నాశనం కాగా.. కొత్తగా వస్తున్న ఉల్లిపాయల్లో నాణ్యత లోపించిందని చెబుతున్నారు. ఈ ఉల్లిపాయలు కిలో రూ.70 నుంచి రూ.100 పలుకుతున్నట్లు సమాచారం. మరోవైపు స్టోరేజ్‌లో ఉన్న నాణ్యతగల ఉల్లి రూ.120 మార్కును తాకుతోందని ఏపీఎంసీ మార్కెట్ మాజీ డైరెక్టర్ అశోక్ వాలుంజ్ చెబుతున్నారు. ఇక రీటెయిల్ మార్కెట్లో ఉల్లి ధర రూ.140 నుంచి రూ.150 వరకు పలుకుతోందని చెప్పారు.

 రవాణా, రెంటల్ ఛార్జీలతో కలిపి మరింత పెరిగిన ఉల్లి ధరలు

రవాణా, రెంటల్ ఛార్జీలతో కలిపి మరింత పెరిగిన ఉల్లి ధరలు

సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీకి రోజు 150 ట్రక్కుల ఉల్లిపాయలు వస్తాయని అయితే మంగళవారం మాత్రం ఆ సంఖ్య 70 లారీల లోడ్‌కే పరిమితమైందని చెప్పారు. దీనికి తోడు అదనంగా లేబర్ ఛార్జీలు, రెంటల్ చార్జీలు పడుతున్నాయని చెప్పారు. దీంతో ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఈ అదనపు ఛార్జీలు చేరి ఉల్లి ధరలను మరింత ప్రియం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మరో నెలరోజుల పాటు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని మనోహర్ తొట్లానీ అనే వ్యాపారి చెప్పారు. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కొనేవారు తక్కువైపోయారని ఉల్లిపాయలు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని మనోహర్ చెప్పారు.

Recommended Video

Onion Prices Double In A Week In Hyderabad || అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధర || Oneindia Telugu
 కొనే వారు తక్కువ..చోరీచేసే వారు ఎక్కువ

కొనే వారు తక్కువ..చోరీచేసే వారు ఎక్కువ

వాడిపోయిన కూరగాయలు లేదా పడేసిన కూరగాయలను తీసుకునేందుకు కొందరు మార్కెట్‌కు వస్తూ ఉంటారని..అలా వచ్చిన వారు ఉల్లిపాయలను చోరీ చేస్తున్నారని మనోహర్ వెల్లడించారు. ముందుగా కొందరు పిల్లలు వస్తారని స్టాక్‌ను చెక్ చేసుకుని ఆ తర్వాత పెద్దవాళ్లు వచ్చి ఉల్లిని చోరీ చేస్తున్నట్లు మనోహర్ చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఉల్లిని చోరీ చేసి మార్కెట్ బయట కాస్త తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇక ఉల్లిపాయలు చోరీకి గురువుతుండటంతో సెక్యూరిటీ కల్పించాల్సిందిగా ఒక వారం క్రితం మార్కెట్ కమిటీకి లేఖ రాయగా ఇప్పటి వరకు స్పందన రాలేదని చెప్పారు.

English summary
Onion rates on Tuesday crossed ₹100, and the vegetable is now charged between ₹120 and ₹130 per kg in the wholesale Agricultural Produce Market Committee (APMC) market in Vashi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X