వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిదొంగలతో పోలీసులకు కొత్త పరేషాన్ ... ఈసారి తమిళనాడులో ఉల్లి చోరీ

|
Google Oneindia TeluguNews

దేశంలో ఉల్లిపాయల దొంగలు ఇప్పుడు పోలీసులను పరేషాన్ చేస్తున్నారు . ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ అనే రైతుకు సంబంధించిన ఉల్లి పంట దొంగతనం జరిగింది.

ఆ మార్కెట్లలో ఉల్లి ధర ఎంతో తెలుసా..?మరింత ప్రియం కానున్న కిచెన్ కింగ్ఆ మార్కెట్లలో ఉల్లి ధర ఎంతో తెలుసా..?మరింత ప్రియం కానున్న కిచెన్ కింగ్

ఇటీవల ఓ షాపులో నగదును వదిలేసి ఉల్లి పాయలు దొంగతనం చేసి సంచలనం సృష్టించగా అదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ నుండి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ కి వెళ్లే మార్గంలో రూపాయల విలువైన ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. ఇక తాజాగా ముత్తుక్రిష్ణన్ అనే రైతు సాగు చేసిన ఉల్లి పంట చేను వద్ద ఉంది. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగు చేసిన ఆయన 350 కేజీల చిన్న ఉల్లిపాయలను 6 చిన్న సంచుల్లో ఉంచి పొలం దగ్గర భద్రం చేసి వెళ్లారు.

Onion theft in Tamil Nadu .. farmer complained to police

అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. నేడు పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు. పొలం దగ్గర తాను భద్రం చేసిన ఉల్లిపాయలు కనిపించకపోవటంతో 350 కేజీల చిన్న ఉల్లిపాయలు దొంగలు ఎత్తుకెళ్లారని ఆయన పడలూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు. దొంగలు ఎత్తుకెళ్లిన ఉల్లిపాయల విలువ మార్కెట్లో రూ.45వేలకు పైనే ఉంటుందని రైతు ముత్తుక్రిష్ణన్ తెలిపారు.

అంతే కాదు తనపంట ఉల్లిపాయలు ఉంచిన ప్లేస్ కూత్తనూర్-అలత్తూర్ మెయిన్ రోడ్ కి 50 మీటర్ల దూరంలోనే ఉందని,మినీ లోడ్ వాహనంతో వచ్చిన దొంగలు ఈ ఉల్లిపాయలను ఎత్తుకెళ్లి ఉండవచ్చిని అనుమానం వ్యక్తం చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి దేశంలో ఉల్లి పాయల రేట్లు విపరీతంగా పెరగటంతో అవి నిత్యావసరం కావటంతో దొంగలు తెగబడ్డారు. ఉల్లి దొంగలతో పోలీసులకు తలనొప్పి పట్టుకుంది.

English summary
At a time when onion prices are increasing on a day to day basis, 350 kilograms of small onions (shallots) were allegedly stolen from a farmer in Koothanur village of Tamil Nadu's Perambalur. K Muthukrishanan, a 40-year-old farmer, had stored 15 sacks of small onions which he had harvested and purchased at his farm
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X