వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!

|
Google Oneindia TeluguNews

ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదనే సామెత.. అందుకే ఉల్లి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉల్లి ధరలు ఇటివల చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలోనే దాని వినియోగం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఉల్లి అనేక రకారలుగా ప్రచారంలోకి వచ్చింది. కొన్ని వ్యాపారల సంస్థలు, హోటళ్లు, ఉచితంగా ఇవ్వాల్సిన ఉల్లిని ..ప్రత్యేక ధరలతో అమ్ముతున్నారు. అది కావాలనుకున్న వాళ్లు అదనపు సొమ్మును చెల్లించాలని బోర్డులు సైతం పెట్టారు.

అరుదైన వస్తువుగా మారిన ఉల్లి

అరుదైన వస్తువుగా మారిన ఉల్లి

దీంతో ఉల్లిని బంగారంతో పోల్చే స్థితికి ప్రజలు చేరుకున్నారు. మరోవైపు ఉల్లికోసం దొంగతనాలు కూడ జరిగిన సంఘనటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలతో అదొక వ్యాపార వస్తువు నుండి అరుదైన వస్తువుల్లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పెళ్లిళ్లలో ఉల్లిని గిఫ్టులుగా ఇస్తే... మరికొంతమంది మాత్రం ఉల్లిని దండలుగా మార్చుకుని మెడలో వేసుకున్న అరుదైన సంఘటనలు కూడ వెలుగులోకి వచ్చాయి.

వ్యాపారులకు గిఫ్టుగా మారిన ఉల్లి

వ్యాపారులకు గిఫ్టుగా మారిన ఉల్లి

ఈ నేపథ్యంలోనే ఉల్లి కొరతను కొంతమంది వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వ్యాపారానికి కాదేది అనర్హం అంటూ సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఉల్లిగడ్డను సైతం తమ డిస్కౌంట్‌ల లిస్ట్‌లో చేర్చారు. సాధారణంగా వ్యాపారులు డిస్కౌంట్ సేల్‌ రూపంలో అనేక వస్తువులు ఇస్తుంటారు. కార్ల నుండి మోటారు బైకుల వరకు విలువైన వస్తువులను గిఫ్టులుగా ఇస్తారు. అయితే తాజాగా మహారాష్ట్రాకు చెందిన వ్యాపారులు ఉల్లిగడ్డను సైతం గిఫ్టులుగా మార్చారు.

మహారాష్ట్ర బట్టల వ్యాపారీ వినూత్న ఆలోచన

మహారాష్ట్ర బట్టల వ్యాపారీ వినూత్న ఆలోచన

మహారాష్ట్రాలోని థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్ ప్రాంతంలో ఓ వస్త్రవ్యాపారీ ఉల్లిగడ్డలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు డిస్కౌంట్ ప్రకటించాడు. వెయ్యిరూపాయల విలువైన బట్టలు కొనుగోలు చేసే వారికి కిలో నాణ్యమైన ఉల్లిగడ్డను అందిస్తామని ప్రకటించాడు. ఉల్లి సమస్యతో సోషల్ మీడియాలో అనేక సెటైర్లు, జోకులో పేలుస్తూ.. తమ నిరసనను తెలుపుతున్న నెటిజన్లు గిఫ్టు ఆఫర్‌ను తెగ తిప్పుతున్నారు. దీంతో ఉల్లిడిస్కౌంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ మారింది.

కాగా ప్రస్తుతం ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్ కిలోకు 100 రూపాయలకు అమ్ముతున్నారు. కిలో రెండువందల నుండి ఇప్పుడిప్పుడే దిగుమతులు చేసుకోవడం వల్ల ధరలు దిగివస్తున్నాయి. పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరో నెల రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
A cloth seller in Maharashtra's Thane district offered one kg onion free on purchase of items worth Rs 1,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X