• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Online classes: Mr టవల్ అరెస్టు, బాత్ రూమ్ లో, లేట్ అయితే ప్రపంచ యుద్దం వస్తుందని ?

|

చెన్నై: కార్పోరేట్ స్కూల్ విద్యార్థులకు అన్ లైన్ లో క్లాసులు తీసుకుంటున్న టీచర్ కొంచెం ఆలస్యం అయితే ప్రపంచం తల్లకిందులు అయిపోతుందని, మూడో ప్రపంచ యుద్దం వస్తుందనే ఆవేశంలో బాత్ రూమ్ లోని నేరుగా టవల్ గుడ్డ కట్టుకుని వచ్చి పాఠాలు చెప్పాడు. టవల్ వెనుక ఆ కామాంధుడి స్కెచ్ గురించి ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు ఎదురుతిరగడంతో ఆ కేటుగాడికి ఇప్పుడు చక్కలు కనపడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా పలువురు లీడర్స్ రంగంలోకి దిగడం, ప్రభుత్వం సీరియస్ కావడంతో మహిళా పోలీసు అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సిటీ డిప్యూటీ లేడీ కమీషనర్ జయలక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేసి మిస్టర్ టవల్ టీచర్ ను అరెస్టు చేసి అతని పాపాల పుట్టను కొంచెంకొంచెం బయటకు తవ్వుతున్నారు. మిస్టర్ టవల్ అరెస్టు కావడంతో అతను ఇంతకు ముందు చేసిన అరాచకాల గురించి ఒక్కొక్క అమ్మాయి ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు రావడంతో రాజకీయంగా, విద్యాశాఖలో కలకలం రేపింది.

Wife:అమెరికాలో భర్త స్కెచ్, ఊర్లో భార్య దారుణ హత్య, రోబో నటుడి బంధువు, సీక్రెట్స్, సినిమా స్టైల్లో!Wife:అమెరికాలో భర్త స్కెచ్, ఊర్లో భార్య దారుణ హత్య, రోబో నటుడి బంధువు, సీక్రెట్స్, సినిమా స్టైల్లో!

 ఫేమస్ స్కూల్ అంటే మాటలా !

ఫేమస్ స్కూల్ అంటే మాటలా !

రాజధాని చెన్నై సిటీలోని కేకే నగర్ లో పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాల (PPBB)కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పద్మశేషాద్రి బాల భవన్ లో రాజగోపాలన్ అనే ఉపాద్యాయుడు గత 20 ఏళ్లుగా పని చేస్తున్నాడు. పాఠాలు చెప్పే ముసుగులో స్కూల్ లోని అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్న రాజగోపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి అతని మీద స్వతంత్ర దర్యాప్తు చేయించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ పూర్వపు విద్యార్థులు, ప్రస్తుతం ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి లేఖ రాయడం కలకలం రేపింది.

 టవల్ తెచ్చిన తంటా

టవల్ తెచ్చిన తంటా

కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. పద్మ శేషాద్రి బాల భవన్ లో చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇదే స్కూల్ టీచర్ రాజగోపాలన్ ఇంట్లో నుంచి ఆన్ క్లాసులు చెబుతున్నాడు. ఇటీవల బట్టలు మొత్తం విప్పేసిన రాజగోపాలన్ బాత్ రూమ్ లో నుంచి నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి అక్కడ కేవలం టవల్ ముక్క మాత్రం కట్టుకుని వెళ్లి అమ్మాయిలకు ఆన్ లైన్ క్లాసులు చెప్పాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 లేట్ అయితే మూడో ప్రపంచ యుద్దం వస్తుందా ?

లేట్ అయితే మూడో ప్రపంచ యుద్దం వస్తుందా ?

బాత్ రూమ్ లో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చి రాజగోపాలన్ టవల్ కట్టుకుని అమ్మాయిలు పాఠాలు చెప్పే సమయంలో కెమెరా ఆన్ లోనే ఉన్నదని సమాచారం. ఆన్ లైన్ పాఠాలు చెప్పడం కొంచెం ఆలస్యం అయితే మూడో ప్రపంచ యుద్దం వస్తుంది అనే టైపులో టీచర్ రాజగోపాలన్ అమ్మాయిల ముందు ఆన్ లైన్ క్లాసులు చెప్పాడు. ఆన్ లైన్ క్లాసుల నెపంతో ఓవర్ యాక్షన్ చేసి అతని కామపురాణం చెప్పిన రాజగోపాలన్ ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయాడు. టవల్ కిందకు కట్టుకుని అసభ్యంగా కెమెరా ముందు నిలబడి ఎక్కడ అంటే అక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకుని అమ్మాయిలకు దర్శనం ఇచ్చాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 అమ్మాయిలతో ఎంత నీఛంగా మాట్లాడంటే ?

అమ్మాయిలతో ఎంత నీఛంగా మాట్లాడంటే ?

కొందరు అమ్మాయిల అవయవాలు, వారి ప్రైవేటు పార్ట్స్ గురించి వర్ణించిన టీచర్ రాజగోపాల్ వారిని సినిమాలకు రావాలని వాట్సాప్ మెసేజ్ లు పంపించాడని, వారికి సెక్స్ పాఠాలు కూడా చెప్పాడని వెలుగు చూసింది. రానురాను టీచర్ రాజగోపాల్ అరచాకాలు ఎక్కువ కావడంతో బాధితులు ఇంతకు ముందే చాలా సార్లు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రోడ్ల మీదకు రావడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది.

 వీడియోలు రికార్డు చేసిన అమ్మాయిలు

వీడియోలు రికార్డు చేసిన అమ్మాయిలు

అమ్మాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు ఎలాంటి దుస్తులు అయినా సూపర్ గా ఉంటాయి, మీరు దుస్తులు లేకుంటే ఇంకా చాలా బాగుంటారు అని రాజగోపాలన్ ఆమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడాడని, ఆ వీడియోలు బాధితులు రికార్డు చేశారని వెలుగు చూశాయి. ఇప్పుడు ఈ నీచుడు మాట్లాడిన వీడియోలు, వాడు చేసిన మెసేజ్ లు ఒక్కొక్కటి బయటకు రావడంతో రాజగోపాలన్ అరచకాల గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 మేడమ్ ఎంట్రీతో సీన్ సిడేల్

మేడమ్ ఎంట్రీతో సీన్ సిడేల్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి, డీఎంకే పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కనిమోళి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. స్కూల్ లో చదువుకుంటున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ రాజగోపాలన్ ను అరెస్టు చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సోదరి కనిమోళి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు మంత్రులు కూడా రాజగోపాలన్ అరాచకాలను ఖండించడంతో తమిళనాడులోని ఎంకే. స్టాలిన్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకునింది.

 మిస్టర్ టవల్ అరెస్టు

మిస్టర్ టవల్ అరెస్టు

చెన్నై సిటీ డిప్యూటీ పోలీసు కమిషనర్ జయలక్ష్మి నేరుగా రంగంలోకి దిగారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ దగ్గరకు చేరుకుని విచారణ చేసిన డిప్యూటీ పోలీసు కమీషనర్ జయలక్ష్మి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కామాంధుడు రాజగోపాలన్ ను చెన్నై సిటీ పోలీసులు అరెస్టు చేశారు. మిస్టర్ టవల్ రాజగోపాలన్ అరెస్టు కావడంతో ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి వారి ఆవేదన గురించి పోలీసు అధికారుల ముందు రహస్యంగా స్టేట్ మెంట్ ఇస్తున్నారు.

 ఇది రాజగోపాలన్ ధైర్యం

ఇది రాజగోపాలన్ ధైర్యం

తాను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నానని మీరు మీ తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే మీమ్మల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తక్కువ మార్కులు వేస్తానని రాజగోపాలన్ విద్యార్థులను బెదిరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా మాకు పై చదువులకు ఇబ్బంది ఎదురౌతుందని విద్యార్థులు భయపడ్డారని ,అందుకే ఇంతకాలం ఫిర్యాదు చెయ్యడానికి వెనకుడు వేశారని, ఇప్పుడు పూర్వపు విద్యార్థులు ధైర్యం చేసి అతని ఆగడాలు బయటపెట్టడంతో అతని పాపం పండిపోయిందని బాధితులు అంటున్నారు.

English summary
Online classes: Chennai Padma Seshadri Bala Bhavan school Teacher Rajagopal suspended and arrested for the sexual harassment of the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X