వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Online classes: ఆన్ లైన్ పాఠాల దెబ్బకు అమ్మాయి ఆత్మహత్య, సీఎం అవార్డు గ్రహీత, టీచర్లు పని !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ శివగంగై: కరోనా వైరస్ పుణ్యమా అంటూ లాక్ డౌన్ అమలు చెయ్యడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న కొందరు టీచర్లు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకువచ్చి మీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి జాగ్రత్త ? అంటూ భయపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక సతమతం అయ్యింది. ఎక్కడ తాను 10వ తరగతిలో ఫెయిల్ అవుతానో అనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆన్ లైన్ పాఠాలు అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర గతంలో శభాష్ అనిపించుకుని అవార్డు తీసుకుంది. ఆమె తెలివితేటలతో, వాక్ చాతుర్యంతో సీఎంతో పాటు మంత్రులు, అధికారులను కట్టిపడేసింది. అయితే ఆన్ లైన్ పాఠాల దెబ్బలకు అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !

 నీట్ విద్యార్థుల దెబ్బతో కలకలం

నీట్ విద్యార్థుల దెబ్బతో కలకలం

తమిళనాడులో నీట్ పరీక్షల దెబ్బకు ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకం రేపింది. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని ప్రతిప్రక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం అంటూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

 ఆటో డ్రైవర్ కూతురు

ఆటో డ్రైవర్ కూతురు

తమిళనాడులోని శివగంగై సమీపంలోని సెల్లప్పనందల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సత్యమూర్తి కుమార్తె సుభిక్ష (15) అనే అమ్మాయి మదురైలో 10వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో మార్చి 25వ తేదీ నుంచి సుభిక్ష చదువుతున్న స్కూల్ మూతపడింది. అప్పటి నుంచి సుభిక్ష ఇంటి దగ్గరే చదువుకుంటున్నది.

 ఆన్ లైన్ పాఠాల దెబ్బ

ఆన్ లైన్ పాఠాల దెబ్బ

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కారణంగా సుభిక్ష చదువుతున్న స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఇంటి దగ్గర ఉంటున్న సుభిక్ష కొంతకాలం నుంచి ఆన్ లైన్ తరగతులకు హాజరౌతున్నది. అయితే స్కూల్ టీచర్లు చెబుతున్న ఆన్ లైన్ పాఠాలు అర్థంకాకపోవడంతో సుభిక్ష సతమతం అయ్యింది.

 టీచర్ల దెబ్బకు ఆత్మహత్య

టీచర్ల దెబ్బకు ఆత్మహత్య

ఆన్ లైన్ పాఠాలు అర్థం కాకపోవడంతో కొన్ని రోజులు సుభిక్ష ఆందోళన చెందింది. సోమవారం ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న టీచర్లతో మాట్లాడిన సుభిక్ష సార్ ఈ పాఠాలు తనకు అర్థంకావడం లేదని చెప్పింది. నువ్వు ఇలాగే ఉంటే 10వ తరగతి పాస్ కావడం చాలా కష్టం అని, నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని చెప్పారని తెలిసింది. టీచర్ల ఒత్తిడితో మరింత ఆందోళన చెందిన సుభిక్ష రాత్రి తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 సీఎం షాక్, ప్రభుత్వ అవార్డు

సీఎం షాక్, ప్రభుత్వ అవార్డు

ఎంతో తెలివితేటలు ఉన్న సుభిక్ష ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, సాటి విద్యార్థులు, స్థానికులతో పాటు ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారు. 2017లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ శతాబ్ధిఉత్సవాలు నిర్వహించింది. ఆరోజు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో బహిరంగ సమావేశంలో ప్రసంగించిన సుభిక్ష తన స్పీచ్, తెలివితేటలతో అందర్ని కట్టిపడేసింది. ఆ రోజు జిల్లాస్థాయిలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి నుంచి సుభిక్ష అవార్డుతో పాటు బహుమతి అందుకుంది. అలాంటి తెలివైన సుభిక్ష ఈరోజు ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

English summary
Online classes: A 10th student allegedly committed suicide in Tamil Nadu, for not being able to understand online classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X