హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భరత్‌పూర్, మరో స్టువర్టుపురం... ఆన్‌లైన్ మోసాలకు కేరాఫ్ అడ్రస్...?

|
Google Oneindia TeluguNews

కారు అమ్ముతానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు, వాహానాలు లేకుండానే ఓఎల్ఎక్స్‌లో ఫోటోలు పెట్టి వాటికి సంబంధించి అడ్వాన్సులు తీసుకున్న తర్వాత మాయం కావడం, అందంగా తాయారు కావడంతో ఓక్కోసారి జవానుల దుస్తుల్లో కూడ ఫోజులు పెట్టి వాహానాల వివరాలు పెట్టడడం , అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు తీసుకోవడం లాంటీ మోసాలు హైద్రబాద్‌లోని రోజుకు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మోసపోయిన బాధితులు పోలీసులకు పిర్యాధులు చేస్తున్నారు.

స్టువర్టుపురంలా మారిన భరత్‌పూర్

స్టువర్టుపురంలా మారిన భరత్‌పూర్

అయితే ఇన్ని నేరాలకు, మోసాలకు కేరాఫ్ ఒక్క ఊరు అంటే అశ్చర్యం వేయక తప్పదు. ఇలా హైదరాబాద్, జంట కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ అన్‌లైన్‌ ఓఎల్ఎక్స్ మోసాలు జరిగినా వాటి మూలలు మాత్రం ఓకే ప్రాంతంలో ఉంటున్నాయి. సంవత్సరంలో నమోదైన మొత్తం సైబర్ నేరాల్లో 90 శాతం మంది అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారు. అదే రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతం, ఇప్పుడు భరత్‌పూర్ ఓకప్పటి స్టువర్టుపురం దోంగల ప్రాంతంగా మారింది.

జంట నగరాల్లో నమోదైన కేసుల్లో 90 శాతం అక్కడి నుండే

జంట నగరాల్లో నమోదైన కేసుల్లో 90 శాతం అక్కడి నుండే

రెండు కమీషనరేట్ పరిధిలో జరిగి, నమోదైన మొత్తం ఓఎల్‌ఎక్స్‌ కేసుల్లో 90 శాతం భరత్‌పూర్ ప్రాంతానికే చెందిన వారేననే పోలీసులు చెబుతున్నారు. అయితే వీరిని కట్టడి చేసేంందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న వారికి సహకరించేందుకు అక్కడి స్థానికులు మాత్రం సిద్దంగా లేరని చెబుతున్నారు. పోలీసులు విచారణకు వెళ్లినప్పుడు భరత్‌పూర్ వాసులు నిందితుల వివరాలు తెలపకుండా నిరాకరించడంతోపాటు ఓక్కోసారి దాడులు కూడ చేస్తారని పోలీసు అధికారులు వివరించారు. ఇక స్థానిక పోలీసుల సహకారం తీసుకున్న పరిష్కారం మాత్రం అంతంతా మాత్రంగానే ఉందని చెప్పారు.

సైబర్ నేరాల్లో ఆరితేరిన భరత్‌పూర్ వాసులు

సైబర్ నేరాల్లో ఆరితేరిన భరత్‌పూర్ వాసులు

ఈ నేపథ్యంలోనే భరత్‌పూర్ వాసులు ఆన్‌లైన్ నేరాల్లో ఆరితేరిన వారు,విచిత్రం ఏమిటంటే ఆన్‌లైన్‌ నేరాల్లో ఆరితేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే వార్తలు కూడ వెలువడ్డాయి. ముఖ్యంగా అమ్మాయిలను ఇవ్వడంలో కూడ పలువురు మధ్య పోటి నెలకొంటుందని సమాచారం. మరోవైపు ఇలాంటీ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారు సాఫ్ట్‌వేర్ రంగంలో కూడ పెద్దగా రాణించే వారు కాదని ,కనీసం ఇంటర్మీడియట్ కూడ చదువని వారు ఇలాంటీ మోసాలకు పాల్పడతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం ఓలెక్స్ నేరాలకు సంబంధించి పోలీసులు హెచ్చరించినా.. ఆన్‌లైన్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి.

English summary
Of the 60 online marketplace fraud cases registered by Hyderabad and Rachakonda police commissionerates this year, as many as 56 — all with similar modus operandi — were traced to the notorious Bharatpur district in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X