వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందు కావాలా నాయానా: గంటలో డెలివరీ అంటూ ఫోన్, బ్యాంక్ డేటా తీసుకొని ఛీటింగ్..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైన్ షాపులు బంద్ చేయడంతో మందుబాబుల నాలుక పీక్కపోతోంది. దీనిని కొందరు ఆసరాగా చేసుకుంటున్నారు. వారి వీక్ నెస్ క్యాష్ చేసుకొని.. అందినకాడికి దోచుకుంటున్నారు. శుక్రవారం కోల్ కతాలో ఒకతనికి ఫోన్ చేసిన మోసగాళ్లు.. ఇష్టమైన బ్రాండ్ గంటలో పంపిస్తామని చెప్పి నమ్మించారు. ఫోన్‌లోనే కార్డు వివరాలు తీసుకొని.. ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి.. పెద్ద మొత్తంలో నగదు దోచేశారు. దీంతో అతను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటున్నాడు.

లిక్కర్ డెలివరీ..

లిక్కర్ డెలివరీ..

కోల్‌కతాకు చెందిన సమీర్ దాస్ (పేరుమార్చం) ఫోన్ వచ్చింది. అతనికి వచ్చిన బ్రాండ్ మందు డోర్ డెలివరీ చేస్తామని అందులోని సారాంశం. మందు లేక నెలరోజులవుతున్న నేపథ్యంలో తనకు ఇష్టమైన బ్రాండ్ చెప్పేశాడు. అయితే అతను బ్యాంకు వివరాలు అడగడంతో ఏమీ ఆలోచించకుండా సమీర్ దాస్ చెప్పేశాడు. గంటలో మందు వస్తుంది కదా అనుకొన్నాడు. కానీ కాసేపటికే బ్యాంకు ఖాతా నుంచి పెద్దమొత్తంలో నగదు డ్రా అయ్యింది.

సమీర్ లాగే..

సమీర్ లాగే..

సమీర్ లాగే చాలామందిని కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కోల్ కతాలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. జార్ఖండ్‌లోని జామతరా జిల్లా నుంచి కొందరు కేటుగాళ్లు ఫోన్ చేశారని గుర్తించారు. కరోనా వైరస్ సందర్భంగా లాక్ డౌన్ ఉండటంతో.. మద్యం పేరుతో మోసం చేయాలని కేటుగాళ్లు ప్రణాళిక రచించి.. అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నుంచి 2.5 లక్షలు దోచిసినట్టు పోలీసులు తెలిపారు.

Recommended Video

IPL 2020 : Kolkata Knight Riders Star Pat Cummins Ready To Play IPL 2020 Behind Closed Doors
ఫోన్ చేసి

ఫోన్ చేసి

కొందరు సోషల్ మీడియా ఫేస్ బుక్‌లో తమ కాంటాక్ట్ నంబర్లను ఇస్తున్నారని కోల్ కతతా పోలీస్ కమిషనర్ (క్రైం) మురళీధర్ శర్మ పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రజలు ఫోన్ చేస్తున్నారని.. మరికొన్నిసార్లు కొన్ని నంబర్లను ఎంపిక చేసుకొని మరీ వారే ఫోన్ చేస్తున్నారని తెలిపారు.

English summary
Kolkata-based businessman Samir Das received a phone call with a promise to deliver his favourite brand of liquor at his door steps, he could not hold back his excitement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X