• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆన్‌లైన్ గేమ్స్.. ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి..!

|

చెన్నై : ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయి. వాటికి అలవాటుపడుతున్న జనాలు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ వ్యామోహంలో పడి తమను తాము మరచిపోతున్నారు. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్‌కు శఠగోపం.. మొబైల్, బైక్‌తో జంప్..!

ఆన్‌లైన్ గేమ్స్‌కు కుర్రకారే కాదు మధ్య వయస్కులు కూడా బానిసలు అవుతుండటం గమనార్హం. తాజాగా తమిళనాడులో ఆన్‌లైన్ పేకాటకు అలవాటు పడ్డ ఓ వ్యక్తి.. భార్యతో సహా ఆత్మహత్య చేసుకోవడం చర్చానీయాంశమైంది.

ఆస్తులు అమ్మి.. అప్పులు జేసి..!

ఆస్తులు అమ్మి.. అప్పులు జేసి..!

తమిళనాడులోని మధురై జిల్లా నాగమలై వాసి వెంకట సుబ్రమణ్యం (40సం.), మీనాక్షి (33సం.) దంపతులు. ఐదేళ్ల కిందట వీరికి వివాహమైనా పిల్లలు కలగలేదు. అయితే ఆన్‌లైన్‌ జూదం రమ్మీకి బాగా అలవాటు పడ్డ సుబ్రమణ్యం ఆర్థికంగా చితికిపోయాడు. దానికి బానిసై ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నాడు. అవి కూడా పేకాటకు సరిపోక అప్పులు చేశాడు.

గంటల తరబడి ఆన్‌లైన్ లో రమ్మీ ఆడుతూ దానికి బానిసైన సుబ్రమణ్యం అప్పుల కారణంగా బాధలు పడ్డాడు. చివరకు ఏమి చేయాలో తోచక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

గేమ్స్ ఆడుతున్నారా..! జర భద్రం

గేమ్స్ ఆడుతున్నారా..! జర భద్రం

ఆన్‌లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్ కొంపలు ముంచుతున్నాయి. అదేపనిగా ఆడుతూ కొందరు మరో పని లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. గంటల తరబడి అందులో మునిగి తేలుతూ వెర్రితలలు వేస్తున్నారు. పబ్‌జీ అదేపనిగా ఆడుతూ చాలామంది యువకులు నరాల బలహీనతతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా కూడా జనాల్లో చైతన్యం రావడం లేదు. ఇక ఓ వివాహిత పబ్‌జీ ఆటకు అలవాటు పడి సంవత్సరం కూడా నిండని పాపను సైతం వదిలి విడాకులు కోరడం గమనార్హం. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

నరాలు వీక్.. మెంటల్లీ డిస్ట్రబ్..!

నరాలు వీక్.. మెంటల్లీ డిస్ట్రబ్..!

ఆన్‌లైన్ గేమ్స్ కొందరి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఏదో సరదా కోసమని, టైమ్‌పాసంటూ ఖాళీ సమయాల్లో వాటితో కుస్తీపడుతూ.. చివరకు ఫుల్‌టైమ్‌గా ఆడేస్తున్నారు. సమయ, సందర్భాలు లేకుండా ఆన్‌లైన్ గేమ్స్‌ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల పెళ్లి పీటల మీద వరుడు పబ్‌జీ ఆడుతూ వచ్చిన అతిథులను కూడా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఏదైనా మితంగా ఉంటే ఓకే.. బానిస ఐతే మాత్రం కష్టం. జీవితం నరక ప్రాయమే. అదే ధ్యాసగా గేమ్స్ ఆడుతున్నవాళ్లలో నరాలు వీక్ అవుతున్నాయి. అంతే కాదు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తోంది. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్న సందర్భాలు అనేకం. క్షణకాలం ఫోన్ చేతిలో లేకుండా అదోలా ఫీలవుతున్నవారు తస్మాత్ జాగ్రత్త. జీవితాన్ని మధురానుభూతులతో ఆస్వాదించండి. పిచ్చి పిచ్చి గేమ్స్‌తో టైమ్ వేస్ట్ చేసుకోకండి, తద్వారా జీవితాలను నాశనం చేసుకోకండి.

English summary
Online games are killing. People who are accustomed to put their lives at risk. Online games are lying in the hobby and forget themselves. Valuable lives are destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X