వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో మరోమోసం.. రూ. లక్ష ఐఫోన్‌కు బదులుగా మరోటి

|
Google Oneindia TeluguNews

ఫ్లిప్‌కార్ట్ వేదికగా మరోమోసం బయటకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ను వేదికగా మార్చుకుంటున్న ఆన్‌లైన్ వ్యాపారులు ,ఇతర కంపనీలు అనేక మోసాలకు తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడ ఫోన్లు, ఇతర వస్తువులు అర్డర్ చేసినవారికి రాళ్లు, ఇటుకలు వచ్చిన పరిస్థితి అనేక సార్లు వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరోమోసం వెలుగు చూసింది.

బెంగళూరుకు చెందిన రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఐఫోన్ 11ప్రోను ఫ్లిప్‌కార్ట్‌లో అర్డర్ చేశాడు. ఇందుకోసం అక్షరాల 93,900 రూపాలయను చెల్లించాడు. అయితే ఇన్ని డబ్బులు చెల్లించి ఫోన్ అర్డర్ చేసిన ఆయనకు సదరు సంస్థ చుక్కలు చూపించింది. ఒరిజినల్‌కు బదులుగా నకిలీ ఫోన్‌ను పంపారు. ఫోన్ తెరిచి చూసిన రజనీకాంత్ అందులో స్క్రీన్‌తో పాటు సాఫ్ట్‌వేర్ కూడ ఐఓఎస్ కాదని చెప్పాడు. దీంతో అర్డర్‌ను తిరిగి వెనక్కిపంపినట్టు తెలిపాడు. అయితే ఇంతవరకు ఫోన్ తిరిగి ఇస్తామని చెబుతున్న ప్లిప్‌కార్ట్ సంస్థ ఎలాంటీ రీప్లేస్ కాలేదని ఆయన వెళ్లడించారు. ఇందుకోసం మరికొన్ని రోజులు వేచి చూసిన తర్వాత ఇతర చర్యలకు పూనుకుంటానని చెప్పాడు.

 Online merchants fraud came out once again by Flipkart

ఇలా ఇప్పుడిప్పుడే అన్‌లైన్ వ్యాపారాలు జోరందుకుంటున్న వేళ, కొద్దిమంది సెల్లర్లు చేసే తప్పిదాలు, మోసాల వల్ల వినియోగదారుల్లో ఆన్‌లైన్ సంస్థలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. దీంతో సాంకేతికంగా పెద్దగా అవగాహన లేని వాళ్లు సంస్థలు చేస్తున్న మోసాలకు బలి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

English summary
Online merchants frauds came out once again by Flipkart.instead of Iphone consumer receaved a duplicate phone in bengalur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X