వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

love: ఆన్ లైన్ గేమ్, రమ్మి రమ్మంది, లవర్ పొమ్మంది, ఇది ఓ పోలీసు స్టోరి, యూనీఫాంలో ఏం చేశాడంటే?!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి/ ముదురై: రమ్మి రమ్మంది, లవర్ పొమ్మంది. ఇది ఓ పోలీసు స్టోరి. ఆన్ లైన్ పేకాట వ్యసనం ఓ పోలీసును బానిస చేసింది. ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో సాటి లేడీ పోలీసును ప్రేమించాడు. ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లోని సాటి ఉద్యోగులు, ఫ్రెండ్స్, బంధువులు, వడ్డీ వ్యాపారులు ఇలా ఎవ్వరు కనపడితే వారి దగ్గర విపరీతంగా అప్పులు చేసి ఆన్ లైన్ లో పేకాట ఆడాడు. పోలీసు ఉద్యోగం కావడంతో అతనికి ఎక్కడెక్కడో అప్పులు పుట్టాయి.

వచ్చే జీతంతో పాటు మామూళ్లు వసూలు చేసి పేకాటకే తగలేశాడు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో సాటి మహిళా పోలీసును పిచ్చపాటిగా ప్రేమించాడు. అయితే ప్రేమించిన లేడీ కానిస్టేబుల్ చావు కబరు చల్లాగా చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన పోలీసు యూనీఫాంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!

ఉద్యోగం వచ్చిందని ఆనందం

ఉద్యోగం వచ్చిందని ఆనందం

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరుప్పరరాయతురై సమీపంలోని అసలై గ్రామంలో గోవిందాజ్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. గోవిందరాజ్ కుమారుడు ఆనంద్ (26) డిగ్రీ పూర్తి అయిన తరువాత మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించాడు. అయితే పోలీసు శాఖలో ఆనంద్ కు కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఏదైనాకాని కొడుకు ఆనంద్ కు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఆయన తండ్రి గోవింరాజ్, కుటుంబ సభ్యులు చాల సంతోష పడ్డాడు.

ఆనంద్ కు అదో ఆనందం

ఆనంద్ కు అదో ఆనందం

మొదటి నుంచి ఊర్లో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న ఆనంద్ కు పోలీసు ఉద్యోగం వచ్చినా అతని పద్దతి మాత్రం మార్చుకోలేదు. వాత్తురై పోలీస్ స్టేషన్ లో ఆనంద్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పేకాట ఆడటానికి వీలుకాకపోవడంతో ఆనంద్ ఆన్ లైన్ లో పేకాట ఆడటం మొదలుపెట్టాడు. పేకాట ఆడుతున్న ఆనంద్ ను ఎక్కడలేని ఆనందం పొందాడు.

రమ్మి వ్యసనంగా మారిపోయింది

రమ్మి వ్యసనంగా మారిపోయింది

ఆన్ లైన్ లో పేకాట ఆడటం, సంపాధించిన మొత్తం జీతం దానికే తగలేయడం మొదలు పెట్టిన ఆనంద్ తరువాత అప్పులు చెయ్యడం అలవాటు చేసుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో. ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవాళ్ల దగ్గర ఆనంద్ విపరీతంగా అప్పులు చేసి మొత్తం డబ్బులు పేకాటకు తగలేశాడు. దినికితోడు ఆనంద్ మామూళ్లు వసూలు చెయ్యడం మొదలుపెట్టాడు.

పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు

పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు

ఆనంద్ ఉద్యోగం చేస్తున్న వాత్తురై పోలీస్ స్టేషన్ లో ఓ యువతి లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. ఆనంద్ సాటి మహిళా పోలీసు మీద మనసు పారేసుకున్నాడు. యువతి ఆనంద్ తో చనువుగా ఉండటంతో ఆనంద్ ఆమెను పీకల్లోతు ప్రేమించాడు. ప్రియురాలి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కొన్ని నెలల ముందు ఓ బుల్లెట్ కొనుగోలు చేశాడు. అయితే తాను నిన్ను ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పడానికి ఆనంద్ చాలా రోజులు ఆలోచించాడు. అదే సమయంలో ఆన్ లైన్ పేకాట ఆడుతూ ఆనంద్ కాలం గడుపుతూ వచ్చాడు.

దెబ్బ మీద దెబ్బ

దెబ్బ మీద దెబ్బ

అప్పులు ఇచ్చిన వాళ్లు లాక్ డౌన్ సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో వచ్చిన జీతం వచ్చినట్లు వడ్డీలు కట్టడానికి సరిపోయింది. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావడానికి ఆనంద్ కు వీలుకాలేదు. ఇదే సమయంలో ఇటీవల ఆన్ లైన్ పేకాట ఆడటానికి ఆనంద్ దగ్గర డబ్బులు లేకపోయింది. ఆన్ లైన్ పేకాట విషయంలో ఆనంద్ తల్లడిల్లిపోయాడు.

నీది వన్ సైడ్ లవ్..... తెలుసా ?

నీది వన్ సైడ్ లవ్..... తెలుసా ?

ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కుదిరింది. తాను నిన్ను ప్రేమిస్తున్నానని ఆనంద్ సాటి లేడీ పోలీసుకు చెప్పాడు. నీది వన్ సైడ్ లవ్, నేను నిన్ను ప్రేమించడం లేదని మహిళా పోలీసు షాక్ ఇచ్చింది. ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని, అప్పులు ఇచ్చిన వాళ్లు తరిగి డబ్బులు చెల్లించానలి ఒత్తిడి చెయ్యడంతో ఆనంద్ కు పిచ్చిపట్టినట్లు అయ్యింది.

యూనీఫాంలో ఆత్మహత్య

యూనీఫాంలో ఆత్మహత్య

పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. రాత్రి పశువుల పాకలోకి వెళ్లిన ఆనంద్ యూనీఫాంలోనే తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేకువ జామున ఆవుకు పాలు పితకాలని వెళ్లిన తండ్రి గోవిందరాజ్ కొడుకు ఆనంద్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ పేకాట కోసం విపరీతంగా అప్పులు చేశాడని, ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని ఆవేదనతో ఆనంద్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
Online rummy: Constable committed suicide due to online rummy game near Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X