వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌ సెక్స్‌: స్పర్శ లేని లోటును తీరుస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్‌ మొదలైన మూడు నెలల తర్వాత 26 ఏళ్ల విద్యార్ధిని ఎమ్మా ఒక జూమ్‌ మీటింగ్‌కు సైన్‌ఇన్‌ అయ్యారు. ఆ గ్రూప్‌లో గతంలో ఆమె ఏనాడు కలుసుకోని, ఆన్‌లైన్‌లో మాత్రమే చాట్‌ చేసిన మిత్రులు ఉన్నారు.

'కిల్లింగ్‌ కిటెన్స్‌' అనే గ్రూప్‌ ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌కు ముందు ఈ గ్రూప్‌ మహిళా సాధికారత పేరుతో సెక్స్‌ పార్టీలను నిర్వహించేది. ఇప్పుడా గ్రూప్‌ వర్చువల్ హౌస్‌ పార్టీలను నిర్వహిస్తోంది.

ఎమ్మా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పార్టీలకు హాజరు కాలేదు.

“అక్కడ చిన్నచిన్న గేమ్‌లు ఆడేవాళ్లం. కిల్లింగ్‌ కిటెన్స్‌ పార్టీకి ఎలాంటి సెలబ్రిటీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అని నిర్వాహకులు మమ్మల్ని అడిగేవారు.’’ అని ఎమ్మా వివరించారు.

"ఈ మీటింగ్‌కు వచ్చినవాళ్లు తమ సెక్స్‌ అలవాట్లు, ఆకాంక్షలు, ఊహల గురించి చర్చించుకునేవారు. సాయంకాలాలు చాలా సరదాగా సాగిపోయేవి. ఆ సమయంలో కొందరు తమ దుస్తులను కూడా విప్పేసేవారు” అని ఎమ్మా అన్నారు.

“పరాయి వ్యక్తులతో సెక్సువల్‌ ఇంటరాక్షన్‌ ఓ అద్భుతమైన, గమ్మత్తయిన అనుభవం” అన్నారామె.

అలాంటి అనుభవం కోసం ఎమ్మా చాలాకాలం ఎదురు చూశారు. తన స్నేహితురాలు ఆమె కుటుంబం దగ్గరికి వెళ్లిపోగా, ఎమ్మా ఒంటరి అయ్యారు. గత మార్చిలో ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఒక్కోసారి ఒంటరితనం మరీ ఇబ్బందిగా అనిపించేదని ఆమె వెల్లడించారు.

గతంలో సెక్స్‌ పార్టీలకు వెళ్లిన అనుభవం ఉన్నప్పటికీ నవంబర్‌ 2019లో కిల్లింగ్‌ కిటెన్స్‌ గ్రూప్‌లో చేరారు ఎమ్మా. “వాళ్లతో కలిసిపోవడానికి మొదట్లో ఇబ్బంది పడేదాన్ని” అని ఆమె అన్నారు.

కరోనా మహమ్మారి రావడంతో ఇదంతా మిస్సవుతానేమోనని ఆమె భయపడ్డారు. తర్వాత కిల్లింగ్‌ కిటెన్స్‌ ఏర్పాటు చేసిన సింగిల్‌ చాట్‌ గ్రూప్స్‌లో చేరారు. దీంతో ఆమెకు చాలామంది క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఏర్పడ్డారు.

వర్చువల్‌ పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ఆమెకు తగినంతమంది స్నేహితులు దొరికారు.

కరోనా సమయంలో సామాజిక దూరం పాటించడమంటే అది శారీరక సుఖం కోరుకునే వ్యక్తులు, జంటలు సెక్స్‌ను కోల్పోవడమే. అయితే స్పర్శతో ఏర్పడే అనుభూతిని ఆన్‌లైన్‌లో సృష్టించడం సులభం కాదు.

డర్టీటాక్‌ జూమ్‌ వర్క్‌ షాపుల నుంచి ఎమ్మాలాంటి వారు హాజరయ్యే సెక్స్‌ పార్టీల్లాంటి వర్చువల్‌ అనుభవాలు శారీరక స్పర్శ అనుభవాన్ని పొందలేనివారికి, ఆ లోటును పూడ్చటంలో కొంత వరకు ఉపయోగపడ్డాయి.

ఇలాంటి సెక్స్‌ పార్టీలకు అటెండ్‌ అయ్యేవారు, ఆన్‌లైన్ సెక్స్‌ చాట్‌ చేసేవారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మానసికంగా కాస్త రిలీఫ్‌ పొందుతారు.

కాకపోతే ఇది శరీరాల స్పర్శతో వచ్చే ఆనందంతో సమానమైనది మాత్రం కాదు.

మహమ్మారి సమయంలో ఇవి సెక్స్‌కు ప్రత్నాయ్నాయంగా కనిపించినా, శారీరక స్పర్శ ప్రాధాన్యాన్ని ఈ వర్చువల్‌ అనుభవాలు నొక్కిచెప్పాయి.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ‘స్పర్శ’లోని ఆనందాన్ని మిస్సయ్యారు

డిజిటల్‌ సాన్నిహిత్యం

యూకేలో కరోనా మహమ్మారి నిబంధనలు, లాక్‌డౌన్‌లులాంటివన్నీ దాదాపు ఏడాదిపాటు సాగాయి. అయితే ఈ సమయంలో ఏకాంతంలో ఇబ్బందులు పడిన వారిలో చాలామంది ఆన్‌లైన్‌ అనుబంధాల గురించి అన్వేషించారు.

'బంబుల్‌’లాంటి డేటింగ్‌ యాప్‌లు వర్చువల్‌ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు, సామాజిక దూరం పాటిస్తున్నవారు అంటూ ప్రత్యేక డేటింగ్‌ ప్రిఫరెన్స్‌లను సృష్టించాయి.

2020లో లాక్‌డౌన్‌కు ముందున్న మార్చితో పోలిస్తే, లాక్‌డౌన్‌ కొనసాగిన మే నెలలో ఆ యాప్‌ ద్వారా చేసుకునే వీడియో కాల్స్‌లో 42శాతం పెరుగుదల కనిపించిందని బంబుల్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

అయితే, వీడియో చాట్‌ ద్వారా మొదటిసారి డేటింగ్ అనుభవం పొందడానికీ, వెబ్‌ ద్వారా సెక్స్‌ అనుభవాలను పంచుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది.

అయినా సరే, చాలామంది వర్చువల్‌గా దగ్గరవుతూనే ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాకు చెందిన ఓ మద్యం కంపెనీ 35 ఏళ్ల లోపు వయసున్న 2000మంది ఒంటరి వ్యక్తులపై సర్వే నిర్వహించించింది.

కరోనా మహ్మమ్మారి కాలంలో వీరిలో 58శాతంమంది వర్చువల్‌ సెక్స్‌ను అనుభవించినట్లు తేలింది. ఇందులో 77%మంది తాము గతంలో ఎన్నడూ నేరుగా సెక్స్‌లో పాల్గొనని వారితో వర్చువల్‌ సెక్స్‌ అనుభవాన్ని పొందారట.

బంబుల్‌ యాప్‌ కంపెనీ యూకేలో 5,000మంది ఒంటరి వ్యక్తులపై సర్వే నిర్వహించగా కరోనా లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా డిజిటల్‌ సాన్నిహిత్యం అనేది ఎంతో అవసరమని 32%మంది అంగీకరించారట.

గత ఏడాదిగా వర్చువల్ సెక్స్‌ అనుభూతిని పొందుతున్న ఎమ్మాలాంటి వాళ్లకు, వర్చువల్‌ సెక్స్‌పార్టీలు, ఎడ్యుకేషనల్‌ జూమ్‌ వర్క్‌షాప్‌లు, దూరంగా ఉండి ఆపరేట్‌ చేసే సెక్స్‌ టాయ్స్‌, సెక్స్‌ పాజిటివ్‌ కమ్యునిటీల్లాంటివి వారిలోని సెక్స్‌ ఆసక్తులను తృప్తిపరచడమే కాక, శారీరక స్పర్శ అనుభూతిపై ఉండే తపనకు ప్రత్యామ్నాయం లేదా విరుగుడు మందుగా పని చేశాయి.

“సెక్స్‌ను చూడటం, చూపించడంలో ఒకరకమైన సంతృప్తి ఉంది” అన్నారు ఎమ్మా. శరీరావయవాలను ప్రదర్శించే విషయంలో ఎమ్మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తనను తాను 'ఎగ్జిబిషనిస్టు’గా భావిస్తారామె.

నిజంగా ఒక జంట శృంగారంలో పాల్గొంటుంటే చూడటానికి, పోర్న్‌ వీడియోలు చూడటానికి తేడా ఉంది. ఈ తరహా అనుభవాన్ని ఇచ్చే సెక్స్‌ పాజిటివ్‌ కమ్యూనిటీలతో కూడా ఎమ్మా పరిచయాలు పెట్టుకున్నారు.

ఆమెకు, తనలాగా ఒంటరిగా ఉండే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. “ఎందుకంటే మేమంతా మా అనుభవాలను పంచుకుంటాం.” అన్నారు ఎమ్మా.

లండన్‌కు చెందిన డేవిడ్‌ 'లీ బౌడెర్‌’ పేరుతో అడల్ట్‌ లైఫ్‌ స్టైల్‌ క్లబ్‌ నడుపుతుంటారు. అక్టోబర్‌లో ఆయన 'పర్పుల్ మాంబా’లాంటి లైఫ్‌స్టైల్‌ క్లబ్స్‌తో కలిసి వర్చువల్ సెక్స్‌ పార్టీలు నిర్వహించారు.

ఈ పార్టీలకు మొదటిసారి వచ్చినవారు తాము నిజంగా ఒక కొత్త లోకంలో ఉన్నామని ఫీలయినట్లు ఆయన గుర్తించారు. "మొదట వర్చువల్ చాట్‌కు దూరం దూరంగా గడిపినవారు తర్వత్తర్వాత ఇందులో హుషారుగా పాల్గొన్నారు” అని డేవిడ్‌ అన్నారు.

కిల్లింగ్‌ కిటెన్‌లాగే ఇలాంటి ఈవెంట్లలో పార్టిసిపెంట్లలో ఉన్న బెరుకును పోగొట్టడానికి డాన్సులు, పాటల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవి అక్కడికి వచ్చిన వారికి మూడ్‌ను మార్చేస్తాయి.

రాన్రాను ఈ పార్టీలు నిజజీవితంలాగా కనిపించడం ప్రారంభించాయి.“సాంకేతిక పరిజ్జానం వాస్తవిక జీవితాన్ని పునఃసృష్టించింది” అన్నారు డేవిడ్‌.

ఆన్‌లైన్ సెక్స్

ఎంత వరకు సేఫ్‌?

ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ సెక్స్‌ పార్టీలు విస్తరిస్తున్నాయి. ఇందులో పాల్గొంటున్న వ్యక్తులు, ప్రాంతాలు, వయో వర్గాల పరిధి క్రమంగా పెరుగుతోంది.

బౌడేర్‌, పర్పుల్‌మాంబా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లు ఇజ్రాయెల్, సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాల వరకు విస్తరించాయి. ఓ శనివారంనాడు జరిగిన పార్టీకి అమెరికా తూర్పు తీరం నుంచి ఆ దేశంలోని అన్ని ప్రాంతాల వారు హాజరయ్యారు.

యువతను ఈ పార్టీలు బాగా ఆకట్టుకుంటున్నట్లు ఎమ్మా చెప్పారు. యువకుల్లో ఎక్కువమందికి ఆన్‌లైన్‌ను ఉపయోగించుకోవడం బాగా తెలియడమే కాక, ఫిజికల్ పార్టీలలో ఉండే ఖర్చుల సమస్య ఇక్కడ తక్కువ కావడంతో వారు ఆసక్తి చూపుతున్నారని ఆమె అంటున్నారు.

కిల్లింగ్‌ కిట్టెన్స్‌లో ఆన్‌లైన్‌ పార్టీలకు 20 యూరోలు, వ్యక్తిగతంగా హాజరు కాగలిగే పార్టీలకు 350 యూరోల బిల్లు వసూలు చేస్తున్నారు.

చిన్న టౌన్‌లో ఉంటున్న ఎమ్మా లాంటివారు ఆన్‌లైన్‌ ఈవెంట్లను బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే స్వయంగా పార్టీలకు హాజరయ్యేవారికి లండన్‌ ప్రయాణం, హోటల్‌ రూమ్‌, కొత్త దుస్తులులాంటి అదనపు ఖర్చులుంటాయి.

“నాలాంటి విద్యార్ధినులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది’’ అన్నారు ఎమ్మా.

బౌడెర్‌, పర్పుల్‌మాంబా లాంటి వర్చువల్ సెక్స్‌ పార్టీలకు ఒక్కోసారి 150మంది వరకు హాజరవుతున్నారు. అందులో దాదాపు సగం మంది మొదటిసారి ఇలాంటి ఈవెంట్‌లో పాల్గొంటున్నవారే.

“చాలామందికి ఇది పూర్తిగా కొత్త అనుభవం”అన్నారు ఎమ్మా. “వీడియో చాటింగ్‌లో ఉన్న సౌకర్యం ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్క్రీన్‌ను క్లోజ్‌ చేయవచ్చు” అంటారు ఎమ్మా.

యూకేకు చెందిన 31 ఏళ్ల మాట్‌, 29 సంవత్సరాల ఎమిలీ కూడా లాక్‌డౌన్‌ సమయంలో తొలిసారి బౌడెర్‌, పర్పుల్‌మాంబా నిర్వహించే వర్చువల్ సెక్స్‌ పార్టీకి హాజరయ్యారు.

“మా ఇంటి నుంచే మేం ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాం. ఇది చాలా సేఫ్‌ కూడా. మేం స్వయంగా ఈవెంట్‌కు హాజరు కావాలంటే చాలాకాలం పట్టేది” అన్నారు ఎమిలీ.

ఆన్‌లైన్‌ ఈవెంట్లు వ్యక్తుల సెక్స్‌ అలవాట్లు, అనుభవాలను ఇతరులతో పంచుకునేందుకు వీలు కల్పించాయి. కొందరు తమ ప్రత్యేక టేస్టులను కూడా ఇతరులకు చెప్పుకోగలిగారు. ఇలాంటివన్నీ నిజంగానే తాము ఇతరులతో కలిసి కూర్చుని మాట్లాడుకున్న అనుభవాన్ని ఇచ్చాయని వారు చెబుతున్నారు.

కరోనా ముందు తాము ఇలాంటి ఈవెంట్‌లో పాల్గొంటామని చాలామంది అనుకోలేదు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మాట్‌, ఎమిలీలాంటి వారు తమ కోరికలకు, అభిరుచులకు నిర్వచనాలు, పేర్లు పెట్టుకునే అవకాశం దక్కింది. అవతలి వారి నుంచి తమ అభిరుచులకు ఉన్న పేర్లను చాలమంది తెలుసుకోగలుగుతున్నారు.

“తమ ఇష్టాయిష్టాలను అభివ్యక్తీకరించుకునే ఇలాంటి ప్రదేశాల సంఖ్య పెరుగుతోంది. పార్టిసిపెంట్లు తమకు నచ్చిన విషయాలు, అలవాట్ల గురించి మాట్లాడగలుగుతున్నారు.” అని మిచిగన్‌లో పని చేసే సెక్సాలజిస్ట్‌ మేగన్‌ స్టబ్స్‌ అన్నారు.

ఆన్‌లైన్ సెక్స్

'స్పర్శ' లేమి

వర్చువల్ సెక్స్‌లో పాలుపంచుకుంటున్న వారిలో చాలామంది ఇది శారీరక స్పర్శకు ప్రత్యామ్నాయం కాదని అంగీకరిస్తున్నారు.

“ఇది ఆన్‌లైన్‌లో గ్రూప్‌ సెక్స్‌ను సృష్టించగలుగుతోంది” అని ఎమ్మా అన్నారు. అయితే ఇది శృంగారానికి పునఃసృష్టి అన్నమాట కొంత వరకే నిజం అంటున్నారు కొందరు నిపుణులు.

ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తాకినప్పుడు శరీరంలో సెల్యూలార్‌ ప్రాసెస్‌ ఒకటి జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ మయామిలో టచ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు అధినేతగా వ్యవహరిస్తున్న టిఫానీ ఫీల్డ్‌ అన్నారు.

“ఆ చిన్న స్పర్శ శరీరంలోని ఒత్తిడిని గ్రహించే కణాలను ప్రేరేపిస్తుంది. నాడీ వ్యవస్థలో అదొక చైన్‌ రియాక్షన్‌లా మారుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. రక్త ప్రవాహం వేగం తగ్గుతుంది. మెదడు తరంగాలు దిశ మార్చుకుని రిలాక్స్‌ మూడ్‌లోకి వెళతాయి” అని స్పర్శకున్న ప్రాధాన్యతను వివరించారు టిఫానీ.

రోగ నిరోధక కణాలను చంపే కార్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ల స్థాయిలను 'స్పర్శ' తగ్గిస్తుందని, దాని కారణంగా సహజమైన రోగ నిరోధక కణాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

“కరోనా కాలంలో మనం 'స్పర్శ' భాగ్యాన్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అంటే సహజంగా లభించే రోగ నిరోధక రక్షణ మనకు లేదన్నమాట.” అన్నారు టిఫాని.

అయితే స్పర్శలేమితో బాధపడేవారు స్వీయ స్పర్శతో కొంత వరకు దీనిని పొందవచ్చంటారు టిఫాని. నడవడం, చిన్నపాటి ఎక్సర్‌సైజులు ఇందుకు ఉపయోగపడతాయని, అలాగే వర్చువల్ సెక్స్‌ కూడా మనసుకు హాయినిచ్చి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని ఆమె చెబుతున్నారు.

ప్రశంసల వెల్లువ

వర్చువల్‌ సెక్స్‌ పార్టీలను ఇక ముందు కూడా కొనసాగిస్తామని అటు నిర్వాహకులు, ఇటు పార్టిసిపెంట్లు చెబుతున్నారు. కొత్త వారితో కలిసి పోవడం ఇక్కడ అంతగా ప్రమాదకరం కూడా కాదని వారంటున్నారు.

ఇంట్లో ఉంటూ భౌగోళికంగా సుదూర ప్రాంతాలలో ఉన్నవారితో మాట్లాడుతూ పెద్దగా ఖర్చులేకుండానే వర్చువల్ సెక్స్‌ లేదంటే డిజిటల్‌ సాన్నిహిత్యపు ఆనందాన్ని అనుభవించడం ఎంతో బాగుందని వారు అంటున్నారు.

( వ్యక్తిగత గోప్యత కోసం ఎమ్మా, డేవిడ్‌, మాట్‌, ఎమిలీల ఇంటిపేర్లు ఇవ్వలేదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Online Sex: Will it fill the satisfaction gap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X