వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక: బిజెపి కొంపముంచిన 9 సీట్లు, 6730 ఓట్లొస్తే కమలానికి 113 సీట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: తొమ్మిది స్థానాల్లో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైంది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కనీస మెజారిటీకి బిజెపి దూరం కావడానికి ఈ 9 స్థానాల్లో ఓటమి పాలు కావడమే కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు సుమారు 6730 ఓట్లు బిజెపిని కనీస మెజారిటికి దూరం చేశాయి.

కర్ణాటక రాష్ట్రంలో మే 12 వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపికి 104 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు, జెడి(ఎస్)కు 38 సీట్లు , ఇద్దరు స్వతంత్రులు ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ, గవర్నర్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు.

కనీస మెజారిటీకి బిజెపి దూరంగా నిలిచింది. సుమారు 9 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్ధులు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ సీట్లలో బిజెపి అభ్యర్ధులు విజయం సాధిస్తే బిజెపి ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేకుండాపోయేది.

ఆ 9 సీట్లలో బిజెపి గెలిస్తే

ఆ 9 సీట్లలో బిజెపి గెలిస్తే

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీస మెజారిటీకి 8 సీట్ల దూరంలో బిజెపి నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి 9 సీట్లలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైంది.

మస్కీలో బిజెపి అభ్యర్ధి 213 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. హిరెకెరూర్ లో 555 ఓట్లతో బిజెపి అభ్యర్ధి ఓడిపోయాడు. కుండ్‌గోల్ లో 634 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. ఎల్లాపూర్ లో 1483 ఓట్లతో బిజెపి అభ్యర్ధి ఓడిపోయాడు. బదామిలో 1696 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి సిద్దరామయ్య విజయం సాధించారు. శృంగేరీలో 1999 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. అధానీలో బిజెపి అభ్యర్ధి 2331 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. బళ్ళారి గ్రామీణ సెగ్మెంట్లో 2679 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.

బిజెపిదే అధికారం

బిజెపిదే అధికారం

బిజెపి ఓటమిపాలైన 9 సీట్లలో ఆ పార్టీకి 6730 ఓట్లు వస్తే ఆ పార్టీ కనీస మెజారిటీ లభించేది. 9 సీట్లలో అతి తక్కువ ఓట్లతోనే ప్రత్యర్ధుల చేతిలో బిజెపి అభ్యర్ధులు ఓటమిపాలయ్యారు. ఈ 9 సీట్లలో బిజెపి అభ్యర్ధులకు 6730 ఓట్లు లభిస్తే పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్ధులు ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే విజయం సాధించేవారే.

మస్కీలో బిజెపి అభ్యర్ధి తక్కువ ఓట్లతో ఓటమి

మస్కీలో బిజెపి అభ్యర్ధి తక్కువ ఓట్లతో ఓటమి

మస్కీలో బిజెపి అభ్యర్ధి 213 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 60367 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధికి 60174 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీల అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం 213 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీలో సుమారు 100 ఓట్లు మారితే గెలుపు ఓటములు మారేవి. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బదులుగా బిజెపి అభ్యర్ధి విజయం సాధించేవాడు.

హెరెకెరూర్ లో బిజెపి అభ్యర్ధి 555 ఓట్లతో ఓటమి

హెరెకెరూర్ లో బిజెపి అభ్యర్ధి 555 ఓట్లతో ఓటమి

హెరెకెరూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 72461 ఓట్లు లభించాయి. బిజెపి అభ్యర్ధికి 71906 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 555 ఓట్ల మెజారిటీ లభించింది. అయితే 278 ఓట్లు అటు ఇటుగా మారితే గెలుపు ఓటములు మారేవి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బదులు బిజెపి అభ్యర్ధి విజయం సాధించేవాడు.

English summary
It was a hard-fought election in Karnataka and the battle is still on. While the BJP emerged as the single largest party, it is still nine short of the majority mark of 113 in the 224-member Assembly.A closer look at the election results reveals that a mere 6,730 votes stood between the BJP and a clear majority in the Karnataka Vidhan Soudha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X