వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ను ఎదుర్కోలేక పరారీలో బీజేపీ.. మూల్యం చెల్లించక తప్పదు: సచిన్ పైలట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. రోజురోజుకు రాహుల్ గాంధీ ప్రజలకు జవాబుదారీగా దూసుకొస్తున్నారని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని గట్టిగా ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే ఉన్నదన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలే విపక్షాలను ఒక దగ్గరకు చేరుస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి కూడా రాహుల్ గాంధీకి మద్దతు లభించింది. తనకు కూడా తన తనయుడు రాహుల్ గాంధీయే బాస్ అని, తన హయాంలో మాదిరిగా రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు క్రుషి చేయాలని గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆమె పిలుపునివ్వడం గమనార్హం.

 రాహుల్ ప్రశ్నలతో బీజేపీలో పెరుగుతున్న ఆందోళన

రాహుల్ ప్రశ్నలతో బీజేపీలో పెరుగుతున్న ఆందోళన

బీజేపీ ప్రభుత్వం, పార్టీ నాయకుల వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ సంధిస్తున్న ప్రశ్నలు విపక్ష పార్టీలకు బలం చేకూరుస్తున్నదని, విశ్వాసాన్నిబలోపేతం చేస్తున్నదన్నారు. సరైన ప్రశ్నల ద్వారా బీజేపీని, ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ ముందుకు సాగడం ద్వారా 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కొనే సామర్థ్యం రాహుల్ గాంధీకే ఉన్నదని రుజువు చేసుకుంటున్నారని చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ప్రశ్నిస్తుండటంతో బీజేపీలో ఆందోళన పెరుగుతున్నదని అన్నారు. ఎన్డీయే కూటమిని ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కోగలదన్నారు.

కర్ణాటకలోనూ విజయం సాధిస్తామని సచిన్ పైలట్ ధీమా

కర్ణాటకలోనూ విజయం సాధిస్తామని సచిన్ పైలట్ ధీమా

బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదికపైకి రావడానికి ఇదే సరైన సమయం అని సచిన్ పైలట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఈ నెల ఒకటో తేదీన వెల్లడైన రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో బీజేపీ గెలుపొందిన అల్వార్, అజ్మీర్ లోక్ సభ స్థానాలను, 2013లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మండల్ గఢ్ అసెంబ్లీ స్థానాన్ని భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరో ఏడెనిమిది నెలల్లో జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్ సీఎం అభ్యర్థి అని భావిస్తుండటం గమనార్హం. కాగా, మరో రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని సచిన్ పైలట్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని వెనక్కు నెట్టివేస్తున్నాయనడానికి నిదర్శనం అని చెప్పారు.

రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకం

రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకం

రైతు అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్రం చెబుతున్నా.. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభానికి బీజేపీ నాయకత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బూత్ మేనేజ్మెంట్ కలిగి ఉన్న పార్టీ బీజేపీని ఓటమిని నుంచి ఇప్పుడు తప్పించలేవన్నారు. ప్రచారక్, విస్తారక్ నినాదాలన్నీ బూత్ మేనేజ్మెంట్‌లో భాగమని, కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఉమ్మడిగా క్రుషి చేస్తే ఎవరి ఆటలు సాగవని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్‌లోని వసుంధరారాజె సింధియా ప్రభుత్వానికి వ్యతిరేకం అని అన్నారు.

 నోట్ల రద్దు, జీఎస్టీపై మూల్యం చెల్లించక తప్పదు

నోట్ల రద్దు, జీఎస్టీపై మూల్యం చెల్లించక తప్పదు

రాజస్థాన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ, నోట్ల రద్దుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నాలుగేళ్ల పాటు జిమ్మిక్కులతో కాలం గడిపిందన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కోటి మందికి ఉద్యోగాలిస్తామని, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.

English summary
BJP was running away from answering questions but Mr. Gandhi was forcing it to be accountable, the Congress’ Rajasthan unit chief said.Congress president Rahul Gandhi is the only person who can take on Prime Minister Narendra Modi in the 2019 polls and his attacks on the government’s failures are galvanising the opposition, party leader Sachin Pilot has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X