చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడనాడు ఎస్టేట్ మిస్టరీ: 'కేవలం శశికళకు మాత్రమే తెలుసు'

దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గార్డ్ హత్య, పలు కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయనే అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గార్డ్ హత్య, పలు కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయనే అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. జయ మృతి తర్వాత అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

చదవండి: పార్టీపై పట్టు కోసం పావులు కదుపుతున్న శశికళ

ఇటీవల జయలలిత ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్, ఆ తర్వాత కొడనాడు ఎస్టేట్‌లో గార్డ్ హత్య, పలువురు అనుమానాస్పద మృతి చర్చకు దారి తీస్తోంది. వీటిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, కొడనాడు ఎస్టేట్ నుంచి ఏం పత్రాలు పోయాయో అర్థం కావట్లేదు.

శశికళకు అన్నీ తెలుసు కాబట్టి..

శశికళకు అన్నీ తెలుసు కాబట్టి..

జయలలిత ఆస్తుల గురించి, ఆమె లెక్కలు, పత్రాలు అన్నీ శశికళకు తెలుసు. కాబట్టి కొడనాడు ఎస్టేట్‌లో ఏం పోయి ఉంటాయో చిన్నమ్మకు తెలుస్తుందని అంటున్నారు. అమ్మ మృతి తర్వాత పోయెస్ గార్డెన్ అంతా శశికళ చేతుల్లోనే ఉంది.

ఎలా వచ్చారు?

ఎలా వచ్చారు?

కొడనాడు ఎస్టేట్‌లోకి వెళ్లిన గ్యాంగ్.. ఎవరైనా పవర్ ఫుల్ వ్యక్తుల ద్వారా జొరబడ్డారా లేక వారికి వారిగా వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఎస్టేట్ నుంచి ఏం కనిపించకుండా పోయాయో... శశికళకు మాత్రమే తెలిసి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

కొడనాడు ఎస్టేట్ ఘటనపై విచారణ అధికారులు శశికళతో కూడా మాట్లాడితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నీ ఆమెకే తెలుసు కాబట్టి ఆమె ద్వారా ఎంతో కొంత విలువైన సమాచారం రావొచ్చునని అంటున్నారు. ఏం కనిపించకుండా పోయాయో ఆమె మాత్రమే చెప్పగలరని అంటున్నారు.

ఏం మిస్సయ్యాయో కష్టంగా మారింది

ఏం మిస్సయ్యాయో కష్టంగా మారింది

కొడనాడు ఎస్టేట్ నుంచి ఏం అదృశ్యమయ్యాయో పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది. ఘటనా స్థలంలో మాత్రం మూడు సూటు కేసులు మాత్రం తెరిచి ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో.. రిస్ట్ వాచెస్, క్రిస్టల్ పీసెస్ కొన్ని అదృశ్యమయినట్లుగా తేలింది. పత్రాలు ఏం మిస్సయ్యాయో తెలియడం లేదు.

మిస్టరీయే.. ఎన్నో అనుమానాలు

మిస్టరీయే.. ఎన్నో అనుమానాలు

కొడనాడు ఎస్టేట్‌లో ఏం అదృశ్యమయ్యాయో తెలుసుకునేందుకు ఓ వైపు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా.. ఒకరి మృతి, మరొకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఏం మిస్టరీ దాగుందనే చర్చ సాగుతోంది.

అంతా కేరళ వారే

అంతా కేరళ వారే

జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ సహా 11 మంది కొడనాడు ఎస్టేట్‌లోకి ఏప్రిల్ 23న చొరబడ్డారని, వారే డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో ఓ గార్డ్ మృతి చెందగా, మరో గార్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో కనగరాజ్ మినహా.. మిగతా వారు కేరళకు చెందిన వారు కావడం గమానార్హం.

కొడనాడు ఎస్టేట్‌లో చోరీ తర్వాత..

కొడనాడు ఎస్టేట్‌లో చోరీ తర్వాత..

కొడనాడు ఎస్టేట్‌లో చోరీ అనంతరం నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయారనని పోలీసులు గుర్తించారు. కనగరాజ్ చెన్నై చేరుకున్నాడు. ఆ తర్వాత తన గ్రామానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రమాదంలో మృతి చెందాడు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన సయన్ ప్రమాదంలో గాయపడ్డాడు. అతని భార్య, కూతురు ప్రమాదంలో మృతి చెందారు.

English summary
It is not yet clear if a gang entered Kodanad estate on its own will or other powerful people were behind the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X