వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లపైకి రండి.... షాపులు తెరవండి, కశ్మీర్‌‌లో రివర్స్ ఆపరేషన్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ ప్రజలు అటు ప్రభుత్వానికి, ఇటు ఉగ్రవాదులకు మధ్య నలిగిపోతున్నారు. ప్రజలను ఉగ్రవాదం నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్దికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు ఉగ్రవాదులకు మధ్య ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసినా... ఉగ్రవాదుల బెదిరింపులతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కల్పించే చర్యలకు పూనుకుంది. వార్త పత్రికలతోపాటు ఇతర ప్రచార మాధ్యమాల్లో ప్రచారం కొనసాగిస్తుంది.

సౌదీ యువరాజు సల్మాన్‌తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ వైఖరిపై డిస్కస్సౌదీ యువరాజు సల్మాన్‌తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ వైఖరిపై డిస్కస్

ఈ నేపథ్యంలోనే ప్రజలు స్వియ నిర్భంధం నుండి బయటకు రావాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రచారం మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేసినప్పటికి ప్రజలు బయటకు రాకపోవడం అభివృద్దికి నిరోధం అని తెలిపింది. ముఖ్యంగా ఉగ్రవాదులు ప్రజలకు బయటకు రావద్దని హెచ్చిరిస్తున్న నేపథ్యంలోనే ప్రజలు స్వేచ్చగా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రభుత్వమే ప్రజలపై ఇంకా ఆంక్షలు పెడుతుందనే అపవాదును ఎదుర్కోంటుంది.

open shops and resume public transport : j&k government

దీంతో కశ్మీర్ ప్రజలు ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలకు భయపడి వారికి లోంగిపోతారా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు చేస్తున్న విషప్రచారంలో 70 ఎళ్లుగా తమ జీవితాలను కోల్పోయారని తెలిపింది. ఓ వైపు వేర్పాటువాదుల పిల్లలు విదేశాల్లో చదువుతుంటే స్థానికుల పిల్లలు మాత్రం తరచు ఉగ్రవాదం హింస, పేదరికంతో మగ్గుతున్నారని చెప్పింది. ఇప్పటికి కూడ అదే ధోరణి అవలంభిస్తున్న వేర్పాటు వాదుల హెచ్చరికలతో లోంగిపోయి.. వ్యాపారాలను దెబ్బతీసుకుందామా అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఇది మన దేశం , మన సంక్షేమం మన భాద్యత అంటూ భయమెందుకు అంటూ ప్రజల్లో భయాన్ని పోగొట్టే వ్యాఖ్యలను ప్రకటనల్లో పొందుపర్చారు.

English summary
Jammu and Kashmir government on Friday issued front-page advertisements in local newspapers asking people to open shops and resume public transport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X