వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కన్నీళ్లు ఆగేదాకా గదిలోనే ఉండిపోయా, లాక్కొని ముద్దు పెట్టారు: ఎంజే అక్బర్‌పై 15వ మహిళ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్ పైన పదిహేను మందికి పైగా మహిళలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోపణలను ఆయన కొట్టిపారేసినప్పటికీ, ఒక్కో మహిళ ఆయనపై ఆరోపణలు చేస్తూ బయటకు వస్తున్న నేపథ్యంలో రాజీనామా చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

<strong>లైంగిక వేధింపుల ఆరోపణలు: కేంద్రమంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా</strong>లైంగిక వేధింపుల ఆరోపణలు: కేంద్రమంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

తుషితా పటేల్ అనే మహిళ కూడా ఎంజే అక్బర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పేపర్ ఎడిటర్‌గా ఆయన పని చేసిన సమయంలో ఆమె అందులో పని చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెండుసార్లు బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని, హోటల్ రూంలో అండర్‌వేర్ పైన తనను ఆహ్వానించారని వాపోయారు.

ఇప్పటికీ నేను నోరు విప్పకుంటే మీ నేరంలో నాకు పాత్ర ఉన్నట్లే

ఇప్పటికీ నేను నోరు విప్పకుంటే మీ నేరంలో నాకు పాత్ర ఉన్నట్లే

ఈ సందర్భంగా ఆమె ఆమె.. ఎంజే అక్బర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు వేధింపుల విషయంలో మీరు అబద్దాలు చెప్పవద్దని సూచించారు. మీ వాదన విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రకటనలు అర్థరహితమన్నారు. మీ విషయంలో నేను ఇప్పటికీ పెదవి విప్పకుంటే మీరు చేసిన నేరంలో నాకు పాత్ర ఉంటుందని భావించి, ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పారు.

అప్పుడు మీరు పూర్తి దుస్తుల్లో లేరు

అప్పుడు మీరు పూర్తి దుస్తుల్లో లేరు

1992లో కోల్‌కతాలో తొలిసారి తాను ఎంజే అక్బర్‌ను కలిశానని బాధితురాలు చెప్పారు. అప్పుడు అతను ఓ పత్రికలో ఉండగా, తాను మరో పత్రికలో పని చేశానని చెప్పారు. తాను తన ఇతర మిత్రులైన జర్నలిస్టులతో ఎంజే అక్బర్‌ను హోటల్లో కలిశానని చెప్పారు. ఆ తర్వాత అతను తన ఫోన్ నెంబర్‌ను తీసుకొని, కలవాలని పలుమార్లు ఫోన్ చేశాడని చెప్పారు. హోటల్లో కలవాలని చెప్పాడని తెలిపారు. తాను హోటల్లో కలిసేందుకు వెళ్లానని, అప్పుడు అతను పూర్తి దుస్తుల్లో లేడని చెప్పారు. తాను డోర్ బెల్ కొట్టానని అన్నారు.

ఆందోళన గుర్తించి కూడా

ఆందోళన గుర్తించి కూడా

ఆ సమయంలో మీరు (ఎంజే అక్బర్) హోటల్ తలుపు తీసినప్పుడు అండర్ వేర్ పైన ఉన్నారని, నేను డోర్ వద్ద నిలబడి ఆందోళనగా నిలబడ్డానని, కానీ మీరు మాత్రం అలా ధరించి కూడా వీఐపీలో నిలబడ్డారని చెప్పారు. నా ఆందోళన గుర్తించి కూడా మీరు అలాగే నిలబడి ఉండటం ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. మరో సందర్భంలో తాను పని మీద ఆయనను హోటల్లో కలిశానని చెప్పారు.

నన్ను లాక్కొని ముద్దు పెట్టుకున్నారు

నన్ను లాక్కొని ముద్దు పెట్టుకున్నారు

హఠాత్తుగా మీరు వచ్చి, తనను లాక్కొని గట్టిగా ముద్దు పెట్టారని బాధితురాలు ఆరోపించారు. మీరు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్న సమయంలో మీ మీసం నన్ను తాకింది ఇప్పటికీ గుర్తుకు ఉందని ఆవేదనగా పేర్కొన్నారు. వెంటనే నేను అక్కడి నుంచి పరుగెత్తి వెళ్ళి రోడ్డు పైకి పోయానని, ఆటో రిక్షాలో ఏడుస్తూ వెళ్లిపోయానని చెప్పారు. మరో సందర్భంలోను మీరు ఎవరూ లేని కాన్ఫరెన్సు గదిలో ఇలాగే ప్రవర్తించారని, బలవంతంగా నన్ను లాక్కొని ముద్దు పెట్టారని చెప్పారు. అప్పుడు నాలో నేను ఏడవటం మినహా ఏమీ చేయలేకపోయానని అన్నారు. ఆ సమయంలో నా కన్నీళ్లు ఆగే దాకా ఆ గదిలోనే ఉన్నానని చెప్పారు. మీరు ఆ భవంతిని వీడే వరకు అక్కడే ఉండి, బాత్రూంలోకి వెళ్లి నా ముఖం ఫ్రెష్‌గా కడుక్కొని, ఆ తర్వాత తన పనిని ముగించుకొని వచ్చానని చెప్పారు.

English summary
Union Minister MJ Akbar's defamation suit against one of his 14 accusers in the #MeToo movement has failed to stop a 15th woman from coming out against him and calling him out on sexual harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X