వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోపాల్ చేరుకున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు..కమల్‌నాథ్‌కే మద్దతు అంటూ ప్రకటన

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. రాజ్యసభ ఎన్నికల ముందు కమల్‌నాథ్ ప్రభుత్వంపై కమలనాథులు ఆపరేషన్ కమల్‌కు దిగారు. మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హోటల్‌లో ఉంచారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు భోపాల్‌కు చేరుకున్నారు. అయితే వారు ఏ హోటల్‌లో బసచేశారు, ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు అన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పకుండానే అదే సమయంలో కమల్‌నాథ్ ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ కొందరు సీనియర్ నేతలకు అప్పగించడంతో వారు ఆ ఎమ్మెల్యేలను మధ్యాహ్నం భోపాల్‌కు తీసుకువచ్చారు. ఐదల్ సింగ్ కన్సానా, కమలేష్ జాతవ్, రణవీర్ జాతవ్, బీఎస్పీకి చెందిన రామ్‌బాయ్ సింగ్, సంజీవ్ కష్వాహా, ఎస్పీకి చెందిన రాజేష్ శుక్లాలు ఉన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నివాసంకు వెళ్లిన వీరు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అనే విషయం మాత్రం చెప్పకుండా ఇంకా కన్ఫ్యూజన్‌ను కొనసాగిస్తున్నారు.

Operation Kamal:All six MLAs in BJPs hold return to Bhopal, extends support to Kamalnath

కాంగ్రెస్‌కే తన మద్దతు ఉంటుందని చెబుతూనే తనను ఏ బీజేపీ నాయకుడు కలవలేదని ఎస్పీ ఎమ్మెల్యే కుశ్వాహ చెప్పారు. అయితే ఢిల్లీలో ఉన్న రాంబాయ్ మాత్రం అక్కడ జరిగిన విషయాలను చెప్పలేదు. తాను తన సొంత నియోజకవర్గానికి వెళుతున్నట్లు చెప్పి అసలు సంగతి వెల్లడించలేదు.కాంగ్రెస్‌కు కమల్‌నాథ్‌కే తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఇక కేబినెట్ బెర్త్ ఆశించి భంగపడ్డ కన్సానా.. తనకు కోపం లేదని అయితే బాధగా ఉందని చెప్పారు. తన కోడలు ఢిల్లీలో చికిత్స పొందుతున్నందున ఆమెను పరామర్శించేందుకు వెళ్లినట్లు చెప్పారు. తనను ఎవరు కిడ్నాప్ చేస్తారని ప్రశ్నించారు కన్సానా. మరో ఎమ్మెల్యే శుక్లా కూడా తను కాంగ్రెస్‌తోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలను సేఫ్‌గా తీసుకొచ్చిన నాయకులు మాత్రం వీరందరినీ బీజేపీ బలవంతంగా తీసుకెళ్లిందని చెబుతున్నారు.

Recommended Video

Rajya Sabha Election Schedule Released,Political Heat Starts In Telugu States! | Oneindia Telugu

ఇక నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిసాహులాల్ సింగ్, హర్దీప్ సింగ్, రఘురాజ్ కన్సానాలను బెంగళూరు లేదా చిక్‌మంగళూరుకు తీసుకెళ్లి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్.ఇదిలా ఉంటే కాంగ్రెస్‌తో విసిగిపోయిన స్వతంత్ర ఎమ్మెల్యే ఠాకూర్ సురేంద్ర సింగ్ కూడా అందుబాటులో లేరు. అతన్ని కూడా బీజేపీ తీసుకెళ్లి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరంతా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఓ ప్రైవేట్ భవనంలో ఉన్నట్లు సమాచారం ఉందని కాంగ్రెస్ వెల్లడించింది.

English summary
Six of the ruling camp MLAs, who were allegedly taken hostage by the BJP on Tuesday night and returned to Bhopal on Wednesday afternoon, refused to give any concrete reply about the details of their whereabouts during the last few hours even as they expressed their support to the Kamal Nath-led Congress government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X