• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ లెక్క పక్కా: ఆ ఇద్దరి ట్రాప్‌లో వారంతా విలవిల..అసలు జరిగిందేంటి..?

|
  Exit Polls 2019 : మోడీ లెక్క పక్కా... ఆ ఇద్దరి ట్రాప్‌లో పడ్డ విపక్షాలు..!! || Oneindia Telugu

  దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడేందుకు ముందు టెన్షన్ క్రియేట్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనా కరెక్ట్ అయితే... మోడీ మళ్లీ ప్రధాని కావడం తథ్యం. ఈ క్రమంలోనే మోడీకి కలిసొచ్చిన అంశాలేంటి..? అసలు 2014తో పోలిస్తే ఈ ఎన్నికల్లో మోడీ మానియా లేదనుకున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో హవా ఒక్కసారిగా ఎందుకు పెరిగింది..?

  బాలాకోట్‌లో సర్జికల్ దాడులు మోడీకి ప్లస్ అయ్యాయా..?

  బాలాకోట్‌లో సర్జికల్ దాడులు మోడీకి ప్లస్ అయ్యాయా..?

  దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ క్యాడర్‌లో జోష్ పుంజుకుంది. అప్పటి వరకు ప్రత్యర్థులంతా విమర్శలు ఎక్కుపెట్టినప్పటికీ ఒక్కసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏకంగా 300 పైచిలుకు సీట్లను ఎన్డీయే సాధిస్తుందని చెప్పగానే సైలెంట్ అయిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ కంటే ముందు ఢిల్లీలో ఎంతో హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు సైతం ఈ ఫలితాలపై నోరుమెదపలేదు. ఇక మోడీకి చాలా వరకు అంశాలు కలిసొచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడైతే గట్టిపోటీ ఇవ్వలేదు అని ముందుగా అంతా భావించారో అక్కడే కమలం పార్టీ కదం తొక్కినట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఇక మోడీకి కలిసి వచ్చిన అంశాలను ఒక్కసారి విశ్లేషిద్దాం.


  బీజేపీకి ప్రజలు రెండో సారి పట్టం కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. అయితే మోడీకి తగ్గుతుందనుకున్న హవా ఒక్కసారిగా ఎందుకు పెరిగిందనే సమాధానం కోసం వెతికితే.... ఆయన ప్రత్యర్థులే అంటే విపక్ష పార్టీలే ఆయన్ను పరోక్షంగా అందలం ఎక్కించాయనే విషయం స్పష్టం అవుతోంది. మోడీని ఓంటరి చేసి ప్రత్యర్థులంతా కూటమిగా ఏర్పాటయ్యారు. కూటమి పాలటిక్స్ బీజేపీలో కాస్త కలవరం రేకెత్తించినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో ప్రజలు కాషాయాన్నే కాపాడుకున్నారనే విషయం అర్థం అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీకి మోడీకి బాగా కలిసొచ్చాయనే విషయం మరవకూడదు. పాకిస్తాన్‌ సైన్యానికి పట్టుబడ్డ వింగ్ కమాండర్ అభినవ్‌ విడుదలకు ప్రధాని మోడీ అంతర్జాతీయంగా తీసుకొచ్చిన ఒత్తిడి చాలామంది ఓటర్లను ఆలోచింపజేసిందనే అభిప్రాయం ఉంది. ఇది కచ్చితంగా ఓటర్లపై ప్రభావం చూపి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలకు కొందరు కాంగ్రెస్ నేతలు, చంద్రబాబులాంటి వారు పరోక్షంగా మద్దతు పలకడంతో విపక్షాలకు భారీగా డ్యామేజ్ తీసుకొచ్చింది.

  కూటమిలో ప్రధాని అభ్యర్థిపై లేని క్లారిటీ

  కూటమిలో ప్రధాని అభ్యర్థిపై లేని క్లారిటీ

  ఇక ప్రధాన అంశం చూస్తే ప్రచారం సమయంలో విపక్షాలు మోడీనే టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పించాయి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేక పోయాయి. ఇక అన్నిటికంటే పెద్ద మైనస్ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించకపోవడం ఆ పార్టీలకు డ్యామేజ్ తెచ్చిపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావి ప్రధాని అని ఆ పార్టీ వారు చెప్పడం మినహాయిస్తే... మాయావతి, అఖిలేష్ మమతాలాంటి వారు వ్యతిరేకించడం యూపీఏకు మరో కీలకమైన నెగిటివ్ పాయింట్‌గా మారింది. ఇక రాహుల్ గాంధీ కూడా తన ప్రచారంలో రఫెల్‌పై విమర్శలు గుప్పించేందుకే సమయాన్ని తీసుకున్నారు తప్పితే వాస్తవానికి రాఫెల్ అంశం గురించి గ్రామీణ ప్రజలకు ఎక్కలేదనేది సుస్పష్టం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాధ్యం కానీ 20శాతం మంది పేద కుటుంబాలకు కనీస వేతనం పథకం న్యాయ్ అమలు చేస్తామని చెప్పడాన్ని ప్రజలు కూడా అంతగా విశ్వసించలేదనేది నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పథకమేనా అనేది చాలామంది ఆలోచించారని గ్రౌండ్ రియాల్టీలో వచ్చిన నివేదికను చూపుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. అంతేకాదు ఎలా అమలు చేస్తామో అనేదానిపై కూడా రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వలేకపోయాడు.

  అసెంబ్లీ ఫలితాలతో అతివిశ్వాసమే కాంగ్రెస్ కొంప ముంచిందా..?

  అసెంబ్లీ ఫలితాలతో అతివిశ్వాసమే కాంగ్రెస్ కొంప ముంచిందా..?

  మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అదే వేవ్ కంటిన్యూ అవుతుందన్న అతి విశ్వాసం ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసి ఉంటుందనే అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో చివరిదాకా వచ్చి బీజేపీ అధికారం కోల్పోయిందన్న సింపథీ ఇప్పుడు కలిసి వచ్చిందనేది కనిపిస్తోందని వారు చెబుతున్నారు.కీలకమైన యూపీలో మోడీ వ్యతిరేకులు సరైన వ్యూహం అనుసరించలేదుఎస్పీ బీఎస్పీ కలిసినా కాంగ్రెస్ ముస్లిం లీగ్‌లు వారి ఓట్లను చీల్చేశాయని చెబుతున్నారు. మొత్తానికి యూపీలో ఉదాసీనతే ఎస్పీ బీఎస్పీ కూటమి కొంప ముంచి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

   రాహుల్ కన్నుగీటడం కౌగలించుకోవడాన్ని పిల్లచేష్టలుగా చూశారా..?

  రాహుల్ కన్నుగీటడం కౌగలించుకోవడాన్ని పిల్లచేష్టలుగా చూశారా..?

  ఇక కూటమిలో ఐక్యమత్యం లేకపోవడం మోడీకి వరమైందనే చెప్పాలి.కర్నాటకలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు , వ్యక్తం చేసిన అభద్రతా భావం అక్కడి ఓటర్లను బీజేపీ వైపు మొగ్గేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మహాకూటమికి ఓటేస్తే మళ్లీ ప్రధానులు మారుతూ ఉంటారనే బీజేపీ ప్రచారం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది. ఐదేళ్ల కాలంలో ఉగ్రదాడి సైన్యం పై జరిగినా కూడా... సామాన్య ప్రజలపై ఒక్క ఉగ్రదాడి లేకపోవడం మోడీ సమర్థతను గుర్తించేలా చేశాయి. పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ మోడీని ఓడిస్తాయని ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ జీఎస్టీ వర్కౌట్ కాలేదన్న విషయం గుజరాత్ ఎన్నికల తర్వాత కూడా గుర్తించలేకపోయారనేది వాస్తవం. అన్నిటికంటే కీలకం ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉన్న రాహుల్ మోడీ పర్సనాలిటీకి సరితూగలేదనేది నిస్పష్టమైన అభిప్రాయం. నిండు లోక్‌సభలో వెళ్లి మోడీని కౌగలించుకోవడం, కన్నుగీటడం లాంటివి కుర్ర చేష్టలుగానే కనిపించాయి. రాఫెల్ విషయంలో సంవత్సరకాలంగా ఆరోపణలు చేస్తున్న రాహుల్ ప్రజల ముందర మాత్రం నిరూపించలేకపోయారు.

   బెంగాల్‌ను సొంత దేశంగా భావించిన మమతా..?

  బెంగాల్‌ను సొంత దేశంగా భావించిన మమతా..?

  ఇక పశ్చిమబెంగాల్‌లో సొంత దేశంలాగా మమతా భావిస్తున్నారన్న ప్రచారం అక్కడి ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. తప్పు చేశాడు అంటున్న పోలీస్ కమిషనర్‌కు విచారణలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నా ఒక పోలీస్ అధికారి కోసం ముఖ్యమంత్రి నడిరోడ్డుపై ధర్నాకు దిగటం ప్రజలకు రుచించలేదు. శారదా స్కామ్ బాధితులు కూడా బెంగాల్ ప్రజలే అన్న విషయం ఆ క్షణాన మరిచిపోవడం దెబ్బతీసింది. మోడీ అమిత్ షాను రాజకీయంగా ఎదుర్కోవలసిన మమతా ... వ్యక్తిగతంగా ఫేస్ చేయడం, రాష్ట్రంలోకి అనుమతించకపోవడం బీజేపీ కోరుకున్న విధంగానే ట్రాప్‌లోకి పడిందనేది స్పష్టం అవుతోంది. అదే అక్కడ ఎప్పుడూ లేని విధంగా హిందూ ఓటర్లను బీజేపీ వైపు టర్న్ చేసింది. ఎర్ర జెండా తప్పితే తెలియని బెంగాల్‌లో ఇప్పుడు కాషాయ జెండా ఎగిరే అవకాశానికి కారణం మమతా స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  సొంత రాష్ట్రాల్లో విపక్ష నేతలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

  సొంత రాష్ట్రాల్లో విపక్ష నేతలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

  ఇక సొంత రాష్ట్రాల్లో కూటమిలోని నేతలకు ఐటీ దాడులు, ఇతరత్రా సోదాలతో ఇబ్బందులు ఎదుర్యయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల నేతలు తమ పార్టీ అజెండా కంటే ముందుగా తమ వ్యక్తిగత అజెండా కోసమే పాకులాడారు. వారి రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచించారు. బీజేపీ ఇలాంటి నాయకులను డిఫెన్స్‌లో పడేసి విజయం సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని శివసేన వీడుతుంది అని అందరూ భావిస్తున్న సమయంలో తమ చాకచక్యాన్ని ఇక్కడ ప్రదర్శించి తమతోనే జతకట్టేలా బీజేపీ పావులు కదిపింది. ఇక ఒడిషాను అతలాకుతలం చేసిన ఫొని తుఫాను పై వెంటనే మోడీ స్పందించడం కూడా అక్కడి ఓటర్లను ఆకట్టుకుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీ మాత్రం తమకు కేంద్రం సాయం అక్కర్లేదని చెప్పడం, బెంగాలీయులను ఆలోచింపజేసింది. మమత అహంకారాన్ని అక్కడి ప్రజలు గమనించారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బెంగాల్ రాష్ట్రంలో రెండు సీట్లున్న బీజేపీ 20 సీట్లకు పైగా గెలిచి మమతకు సవాల్ విసిరే అవకాశాలున్నాయని అనలిస్టులు చెబుతున్నారు.


  మొత్తానికి 2014లో మోడీ వేవ్ ఎలాగైతే పనిచేసిందో... 2019లో కూడా మోడీ షా మంత్ర పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో మోడీ-షా తీసుకున్న పొలిటికల్ మూవ్స్ మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

  English summary
  With the exit polls out, it would be the BJP led NDA at the centre that would make into power. In this back drop, Political analysts say that there were many factors that gave a massive victory to the BJP in the exit polls. Surgical strikes gave a fetching to the saffron party,while Rahul's continuous criticizm on one Rafale issue put the congress behind.One big negative point that is being talked about is that the Mahaghatbandhan had failed to declare its PM candidate and differences among them was seen as a major boost to Modi and Shah.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X