వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒప్పో ఎఫ్7: ఆసక్తికరం, అద్భుతం.. మరింత కొత్తదనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిరీక్షణ పూర్తయింది. మార్చి 26, 2018న సెల్ఫీ ఎక్స్‌పర్ట్, లీడర్ అయిన ఒప్పో అందరి ఎదురుచూపులు ఫలించేలా ఒప్పో ఎఫ్7 డివైస్‌ను తీసుకు వచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ పైభాగాన నాచ్‌ను అమర్చారు. సమకాలీన స్మార్ట్ ఫోన్‌లలో ఉన్నట్లు సెల్ఫీ కెమెరా ఉండటంతో పాటు, ఒప్పో ఎఫ్7లో అత్యాధునిక సాంకేతికతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అప్లికేషన్లను కూడా పొందుపరిచింది. ఈ అప్లికేషన్ కారణంగా మిగతా వాటికంటే ఇది ఎంచుకోతగ్గదని చెప్పవచ్చు.

ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. మీ సొంతం చేసుకునేందుకు ఏడు అద్భుతమైన కారణాలు!ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. మీ సొంతం చేసుకునేందుకు ఏడు అద్భుతమైన కారణాలు!

4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఒప్పో ఎఫ్7 ధర రూ. 21,990గా ఉండగా, 6 జీబీ రామ్ 128 జీబీ స్టోరోజ్ సామర్థ్యం కలిగిన ఫోన్ ధర రూ. 26,990గా ఉంది. మిడ్ రేంజ్ మార్కెట్లో ఒప్పో ఎఫ్7 కచ్చితంగా మంచి సేల్‌కు అవకాశముంటుంది. కాగా, ఈ ఫోన్‌ను ఇండియన్ క్రికెటర్ టీమ్ మెంబర్ రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యాలు ముంబైలో లాంచ్ చేశారు.

ఇప్పటికే మేం ఫోన్ బేసిక్ ఫర్ఫార్మెన్స్, డిజైన్లలో కొత్తదనం చూపించాం. ఇప్పుడు మరింత లోతుగా ఫోన్ స్పెసిఫికేషన్స్, స్పష్టత తదితరాలు చూద్దాం.

OPPO F7: First Impressions Of The New “Selfie Expert”, At A Price Of Rs. 21,990!

డిజైన్ మరియు డిస్ ప్లే

కచ్చితమైన ఇండస్ట్రియల్ డిజైన్ కారణంగా ఒప్పో ఎఫ్7 2018లోనే ఆధునికత, స్టైలిష్ స్మార్ట్ ఫోన్ మరియు డిజైన్‌కు సూచిక అవుతుంది. 7.5 ఎంఎం మందం, 158 గ్రాముల బరువు ఉండే ఈ ఫోన్ ఎవరికీ బల్కీగా అనిపించదు. ఎఫ్7 ఫోన్ మూడు రంగులలో మార్కెట్లుకి వస్తుంది. సోలార్ రెడ్, డైమాండ్ బ్లాక్, మూన్ లైట్ సిల్వర్ రంగులలో వస్తుంది. ఈ మూడు రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

ఒప్పో ఎఫ్7 యూని బాడీలో 6.2 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్. 1080×2280 పిక్సెల్స్ రిజొల్యూషన్ మీకు గేమింగ్, రీడింగ్ సమయంలో స్పష్టమైన, మంచి అనుభూతి కలిగిస్తుంది. అద్భుతమైన డిస్ ప్లే కారణంగా మీరు కూడా మీ లాక్ స్క్రీన్‌ను పలుమార్లు చూడవచ్చు.

ఈ ఫోన్‌లో మరింత ఆసక్తికరమైన, మీకు నచ్చే అంశం యాప్ ఆన్ యాప్ ఫంక్షన్. గేమ్ ఆడుకుంటూ మీరు మీ ఫోన్ పిక్ చేసుకోవచ్చు.

OPPO F7: First Impressions Of The New “Selfie Expert”, At A Price Of Rs. 21,990!

కెమెరా

ఒప్పో ఎఫ్7 యొక్క కెమెరా అమోఘం. సెల్ఫీ అనుభూతిని ఓ ఎత్తుకు తీసుకు వెళ్తుంది. 16 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా రియల్ టైమ్ హెచ్‌డీఆర్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ కారణంగా ఇది కాంట్రాస్ట్, కలర్ రేంజ్ ఇమేజ్‌ను మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా సెల్ఫీలను అందిస్తుంది.

ఒప్పో ఎఫ్7లో అల్గారిథమ్‌లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను అమర్చారు. దీని కారణంగా స్పష్టమైన, అద్భుతమైన చిత్రాలు వస్తాయి. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బ్యూటీ 2.0 సాంకేతికత 296 ఫేసియల్ రికగ్నైజేషన్ పాయింట్స్ స్కాన్ చేస్తుంది. గ్లోబల్ డేటాబేస్‌కు ఎగైనెస్ట్‌గా ఫేసియల్ షాట్స్‌ను స్టడీ చేస్తుంది. తద్వారా సహజంగా కనిపించే అందాన్ని వృద్ధి చేస్తుంది.

స్నాప్ చాట్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ఆల్ రెడీ ఏఆర్ స్టిక్కర్స్‌ను ఆఫర్ చేస్తుంది. అది మీ సెల్ఫీలను అందంగా కనిపించే రాబిట్ లేదా మూవీ స్టార్‌లా మారుస్తుంది. మరో ముఖ్య విషయం ఏమంటే ఇది ఏ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నప్పటికీ పని చేస్తుంది. ఇది ఆశ్యర్చం కాదంటారా?

OPPO F7: First Impressions Of The New “Selfie Expert”, At A Price Of Rs. 21,990!

పర్ఫార్మెన్స్ మరియు సాఫ్టువేర్

ఒప్పో ఎఫ్7 స్పోర్ట్స్ ఫోన్‌లో 64 బిట్ 4 జీబీ కోర్ ప్రాసెసర్. ఇన్ బిల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దానంతట అదే ప్రాసెసర్ పవర్ ప్రక్రియను డివైస్‌లోని మల్టిబుల్ ఆపరేటింగ్ ప్రాంతాలకు కేటాయిస్తుంది. తద్వారా ఫోన్ స్మూత్‌గా ఉంటుంది. పైభాగంలో, బ్యాటరీకి తగినంత కేటాయిస్తుంది. తద్వారా ఫోన్ బ్యాటరీ లైఫ్ రోజువారి వినియోగ సగటును పెంచుతుంది.

ర్యామ్ (RAM), స్టోరేజ్ విషయానికి వస్తే 4 జీబీ రామ్, 64 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. అంతేకాకుండా 6 జీబీ రామ్, 128 జీపీ స్టోరేజ్‌తో మరో హయ్యర్ ఎండ్ వర్షన్ కూడా ఉంది. రెండు ఫోన్లలోను ట్రిపుల్ మెమరీ కార్డు ఉంది. స్టోరేజ్‌ను 256 జీబీ వరక్ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.

ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ 8.1 ఆండ్రాయిడ్ ఓరియో ఆధారిత లేటెస్ట్ కలర్ ఓఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేసియల్ టెక్నాలజీ కారణంగా కేవలం 0.08 సెకన్ల వ్యవధిలోనే స్క్రీన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. స్క్రీన్ టర్న్ ఆన్ కాగానే ఎఫ్7 మిమ్మల్ని గుర్తిస్తుంది.

డ్యూయల్ 4జీ వోల్ట్ కార్డ్ స్లాట్స్ ఉన్నాయి. ఈ కారణంగా రెండు 4జీ సిమ్ కార్డులు ఒకేసారి ఉపయోగించవచ్చు. ఓ 4జీ ఫోన్‌తో ఫోన్ కాల్ మాట్లాడుతూ.. మరో 4జీ కనెక్షన్‌తో గేమింగ్ లేదా ఇతర సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. నిజం, ఇది సీరియస్!

కాబట్టి, మీరు ఈ ఏడాదిలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటే, మీరు కచ్చితంగా కొత్త ఒప్పో ఎఫ్7ను కొనుగోలు చేయవచ్చు.

English summary
The wait is over. On March 26th, 2018, the "Selfie Expert And Leader", OPPO, finally lifted the curtains on its much-awaited flagship device-the OPPO F7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X