వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకటనలు కాదు..చేతుల్లో డబ్బులు పెట్టండి: కేంద్రం ప్యాకేజీపై నిప్పులు చెరిగిన విపక్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివిధ రంగాలకు ఊరట కల్పిస్తూ కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేవలం ఒక మాయ మాత్రమే అని కాంగ్రెస్ విమర్శించింది. కొన్ని లక్షల కోట్లు మాటల్లో పలుకుతాయని అయితే చేతల్లో మాత్రం ఏమీ కనిపించదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. తెలివైన మాటలతో ప్రజలను మాయ చేస్తూ బీజేపీ సర్కార్ బోల్తా కొట్టిస్తోందని మండిపడింది. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వలసకార్మికులకు, చిరు వ్యాపారులకు, రైతులకు ఆర్థిక సహకారం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ కత్తులు దూసింది. అది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కాదని అది కేవలం మాటల ప్యాకేజీ మాత్రమే అని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు.

బాహుబలి ప్యాకేజీకి కేంద్రం సిద్దం..? త్వరలో సీతారామన్ ప్రకటన.. ఎంత ప్రకటించనున్నారో తెలుసా..?బాహుబలి ప్యాకేజీకి కేంద్రం సిద్దం..? త్వరలో సీతారామన్ ప్రకటన.. ఎంత ప్రకటించనున్నారో తెలుసా..?

దేశ పౌరుల ఖాతాల్లోకి ఎంత డబ్బులు బదిలీ చేస్తుందనేదానిపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ పేరుతో ముందుకొచ్చిందని అహ్మద్ పటేల్ ఎద్దేవా చేశారు. గాల్లో మేడలు కట్టడం మాని ప్రభుత్వం వాస్తవాన్ని ఆలోచించాలని అహ్మద్ పటేల్ సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్‌ విమర్శలకు గొంతు కలిపింది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వట్టి బూటకమని చెప్పుకొచ్చింది.

Opposition attacks centre over the relief package anounced by Centre

బుధవారం గురువారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల్లో ఏమీ లేదని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్ విమర్శించారు. కేంద్రం చెప్పిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అసాధ్యమని దాన్ని అమలు చేయడం చాలా కష్టమని చెప్పారు. వలస కూలీలకు నేరుగా డబ్బులు ఇవ్వలేదని చెప్పిన రాయ్... ఈ ప్యాకేజీ బూటకపు ప్యాకేజీ అని స్పష్టం చేశారు. ఇక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా కేంద్రం ఇచ్చిన రిలీఫ్ ప్యాకేజీని తప్పుబట్టారు. రైతులకు రుణం తీసుకోవాలని చెప్పడం సమస్యకు పరిష్కారం ఇస్తుందా అని ప్రశ్నించారు. అంతేకాదు రైతలకు, పేదలకు ఈ సమయంలో వారి చేతుల్లో డబ్బులు ఉంచాల్సింది పోయి రుణాలు తీసుకోమని చెప్పడాన్ని తాను ఖండిస్తున్నట్లు అఖిలేష్ చెప్పాడు. ఇది ప్యాకేజీ కాదని చెప్పిన అఖిలేష్ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు వినియోగించిన మంత్రం అని విమర్శించారు.

English summary
The relief measures announced by the centre to ease financial burden on different economic sectors were "creative accounting" and "empty package wrapped in speeches", the Congress said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X