వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌స‌భ స‌మావేశాల‌ బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడ

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన చేసిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం లోక్ సభ సమావేశాలను బాయికాట్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనకు దిగిన ఎంపీలు.. రాజ్యసభలో పరిణామాలపై చర్చకు పట్టుపట్టారు. కానీ ఎగువ సభ వ్యవహారాలను దిగువ సభలో మాట్లాడేందుకు వీల్లేదని స్పీకర్ ఓం బిర్లా చెప్పడంతో ఈ మేరకు విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.

రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్‌రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్‌

భవిష్యత్ కార్యాచరణపై భేటీ

భవిష్యత్ కార్యాచరణపై భేటీ


రాజ్యసభలో ఎన్డీఏకు బలం లేకపోయినా, సభ్యులు డివిజన్ ఓటింగ్ కోరినా, డిప్యూటీ స్పీకర్ హరివంశ్ సింగ్ అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించడం, ఆ చర్యను అడ్డుకున్నారనే సాకుతో ఎనిమిది ఎంపీలపై వేటు వేయడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. లోక్ సభ నుంచి బాయికాట్ చేసిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ సహా వివిధ పార్టీల నేతలు పార్లమెంట్ ఆవరణలోనే సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బాయికాట్ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న స్పీకర్ ఓం బిర్లా.. మరోసారి విపక్ష ఎంపీలను తన ఛాంబర్ కు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు.

కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..

కార్మిక చట్టాలకు సవరణలు..

కార్మిక చట్టాలకు సవరణలు..

వ్యవసాయ బిల్లులపై వివాదం ఇంకా చల్లారక ముందే కేంద్రం దూకుడు ప్రదర్శించింది. కార్మిక చట్టాలకు సంబంధించి కీలక సవరణల్ని చేపట్టింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మంగళవారం సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020 మరియు ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020 పేరుతో కార్మిక చట్టాల్లో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఈ ప్రయత్నాన్ని కూడా విపక్షాలు తప్పుపట్టాయి.

బీఏసీలోనూ పాల్గొనబోమంటూ..

బీఏసీలోనూ పాల్గొనబోమంటూ..


లోక్ సభ సమావేశాలను బాయికాట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు.. రాజ్యసభ బీఏసీ సమావేశానికి కూడా హాజరుకాబోమని ప్రకటించాయి. ఆ ఎనిమిది ఎంపీలు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ ఎత్తేసే దిశగా ఆలోచిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించిన దరిమిలా, బీఏసీ సమావేశంలో విపక్షాలను ఒప్పించాలని చైర్మన్ వెంకయ్య నాయుడు భావించారు. కానీ భేటీకి తాము రావట్లేదని కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ తదితర పార్టీలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. రాజ్యసభలో మంగళవారం ఒక్కరోజే ఏడు బిల్లులు ఆమోదం పొందడం గమనార్హం.

English summary
Opposition parties led by Congress boycott Lok Sabha session, in support of Rajya Sabha MPs who have been suspended for one week and farm bills issue. Union labour minister Santosh Kumar Gangwar tables three crucial labour codes in Lok Sabha. Opposition also boycotts Rajya Sabha’s Business Advisory Committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X