నిప్పులు చెరిగిన మాయా, 'ప్రధాని వస్తారా.. రారా చెప్పండి'

రాజ్యసభ తిరిగి రెండు గంటలకు ప్రారంభమైంది. అయితే, ప్రతిపక్షాల గందరగోళం మధ్య వెంటనే వాయిదా పడింది.

న్యూఢిల్లీ: రాజ్యసభ తిరిగి రెండు గంటలకు ప్రారంభమైంది. అయితే, ప్రతిపక్షాల గందరగోళం మధ్య వెంటనే వాయిదా పడింది. ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ సభ్యులు గులాం నబీ ఆజాద్, బహుజన సమాజ్ వాది పార్టీ ఎంపీ మాయావతి తీవ్రంగా మండిపడ్డారు.

నోట్ల రద్దుతో 93 శాతం మంది సంతోషంతో ఉన్నారనే సర్వే శుద్ద అబద్దమన్నారు. అదంతా వట్టిదేనని ఆరోపించారు. ప్రధాని నిర్ణయం పట్ల చాలామంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. అసలు ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు వస్తారా లేదా చెప్పాలని ఆజాద్ ప్రశ్నించారు.

Opposition devising ways to avoid debate on demonetisation says Arun Jaitley.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రధాని చర్చకు వస్తారని చెప్పారు. నోట్ల రద్దు అంశం పైన చర్చ జరగకుండా ప్రతిపక్షాలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సభను అడ్డుకోవడానికి విపక్షాలు ఒక్కోసారి ఒక్కో కారణం వెతుకుతున్నాయన్నారు. నోట్ల రద్దు, దాని అమలు సరిగా వెళ్తోందని, ఎలాంటి పొరపాటు లేదని తమ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని జైట్లీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+