వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు స్పీకర్ కు హైకోర్టు నోటీసులు: పన్నీర్ సెల్వం, 11 మంది ఎమ్మెల్యేలపై వేటు కేసు !

తమిళనాడు స్పీకర్ ధనపాల్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టుపన్నీర్ సెల్వంతో సహ 11 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదుఅక్టోబర్ 12 లోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు. చిక్కుల్లో తమిళనాడు పళనిసామి ప్ర

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు స్పీకర్ ధనపాల్ చిక్కుల్లో పడ్డారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేసిన పన్నీర్ సెల్వంతో సహ ఆయన వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు సమాధానం చెప్పాలని మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 12వ తేదీలోపు సమాధానం చెప్పాలని బుధవారం మద్రాసు హైకోర్టు స్పీకర్ ధనపాల్ కు నోటీసులు జారీ చేసింది. ఎడప్పాడి పళనిసామి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో పన్నీర్ సెల్వంతో సహ ఆయన వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

OPS 11 more MLAs be disqualified case Madras HC issues notice Speaker

అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లంఘించి ప్రభుత్వాన్ని దిక్కరించి ఓటు వేసిన పన్నీర్ సెల్వంతో సహ 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ ఎందుకు చర్యలు తీసుకోలేదు సమాధానం చెప్పాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

టీటీవీ దినకరన్ వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల మీద నియమాలు ఉల్లంఘించి స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు స్పీకర్ ధనపాల్ కు నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని సూచించింది.

English summary
Chennai HC issues notice to Speaker on DMK's plea on OPS and 11 MLAs should be disqualified for voting against to Edappadi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X